TRINETHRAM NEWS

రాష్ట్రంలో అగమ్యగోసరంగా గురుకుల విద్యాలయాల పరిస్థితి,
గిరిజన విద్యార్థుల భవిత్వ్యాం మాటేమిటి.

ఆంధ్రప్రదేశ్ త్రినేత్రం న్యూస్ (అరకులోయ) పట్టణం అల్లూరి సీతారామరాజు జిల్లా:
రాష్ట్రంలో.గురువులు లేని గురుకుల విద్యాలయాలు. గిరిజన విద్యార్థులకు విద్యకు.చాలా చిన్న చూపు అన్యాయం.

టిడిపి .జె ఎస్ పి. బిజెపి పార్టీల కూటమిరాష్ట్ర ప్రభుత్వం గిరిజన ఉపాధ్యాయుల విద్యార్థుల సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలం…

రాష్ట్ర గవర్నర్ గిరిజన విద్యార్థుల చదువు కోసం తక్షణమే స్పందించాలి న్యాయం చేయాలి!!!*

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీ పాచి పెంట చిన్నస్వామి డిమాండ్?

అల్లూరి సీతారామరాజు జిల్లా.!
అరకు వేలి నియోజకవర్గం.!
అరకువేలిమండల న్యూస్ తేదీ 5-12-2024న ఏపీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాచిపెంట శాంత కుమారి ఆదేశాల మేరకు అరకు వేలి గిరిజన గురుకుల పాఠశాల లో కాంగ్రెస్ పార్టీ నాయకులు పర్యటించి విద్యార్థుల ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా ఏపీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు శ్రీ పాచి పెంట చిన్న స్వామి
మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారు 199 పాఠశాలలు 80 వేల విద్యార్థులు విద్యన్ని అభ్యసిస్తున్నారు ఉపాధ్యాయులు 1650 మంది పనిచేస్తున్నారు గురువులు లేని గురుకుల విద్యాలయాలు గిరిజన విద్యార్థులకు విద్యకు చాలా చిన్న చూపు అన్యాయం చేస్తున్నారు గిరిజన విద్యార్థుల ఉపాధ్యాయుల సమస్యలు రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఉపముఖ్యమంత్రి వర్యులు మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రివర్యులు రాష్ట్ర కూటమి ప్రభుత్వము గిరిజన ఉపాధ్యాయుల విద్యార్థుల సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలం అయ్యారు తక్షణమే గౌరవ రాష్ట్ర గవర్నర్ స్పందించి గిరిజనులకు న్యాయం చేయాలి. గురుకుల అవుట్ సోర్సింగ్ అధ్యాపకులు ఉపాధ్యాయులు సమస్యలపై రాష్ట్రంలో ఐటిడిఏ వద్ద సుమారు 20 రోజుల నుండి చేపడుతున్న నిరాహార దీక్ష కు సంపూర్ణ మద్దతు కాంగ్రెస్ పార్టీ ప్రకటిస్తున్నాము తెలుగుదేశం జనసేన బిజెపి పార్టీల కూటమి రాష్ట్ర ప్రభుత్వము ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు ఎన్నికల సమయంలో సుమారు 64 శాఖల ఉద్యోగస్తులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు తక్షణమే నెరవేర్చాలి అని కాంగ్రెస్ పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాము
గురుకుల అవుట్ సోర్సింగ్ అధ్యాపకులు ఉపాధ్యాయులు సుమారు 15 సంవత్సరాల నుండి ఉపాధ్యాయ వృత్తిని నమ్ముకుని చాలీచాలని జీతాలతో వారి యొక్క వయసులో పైబడిన ఈ వృత్తిని నమ్ముకుని ఏ ఉద్యోగానికి వెళ్లలేక రాత్రి పగలు గిరిజన విద్యార్థుల కోసం కష్టపడి పనిచేస్తున్నారు
గురుకులము స్థాపించినప్పటి నుండి ఎప్పుడు కూడా వారి యొక్క న్యాయనిబంధన ప్రకారము అక్కడ పోస్టులను జనరల్ డిఎస్సి లో కలపటం లేదు కానీ.సుమారు 1200 ఉపాధ్య పోస్టులను జనరల్ డిఎస్సి లో కలపడం వలన గిరిజన గురుకుల అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయులు చాలా అన్యాయనికి గురి అవుతున్నారు వీరికి ఇచ్చిన హామీ కాంట్రాక్టు ఉపాధ్యాయులుగా తక్షణమే అమలు చేయాలి. . గిరిజన సంక్షేమము గిరిజన గురుకులాలు కూటమి రాష్ట్ర ప్రభుత్వము నిర్మిరియాము చేయడమే కంకణం కట్టుకుంది ఇందులో భాగమని కాంగ్రెస్ పార్టీగా భావిస్తున్నాము ఇది చాలా దుర్మార్గము వీరి యొక్క నిరాహార దీక్ష వలన గిరిజన విద్యార్థులు విద్యకు దూరం అవుతున్నారు వీటి దృష్టిలో పెట్టుకుని ఇటు గిరిజన విద్యార్థులకు అటు గిరిజన గురుకుల ఉపాధ్యాయులకు తక్షణమే ఈ కూటమి రాష్ట్ర ప్రభుత్వము న్యాయం చేయాలని వారి యొక్క న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ నుండి కూటమి రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము లేనియెడల గురుకుల ఉపాధ్యాయుల తరఫున కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాము

ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పాంగి గంగాధర్ ప్రధాన కార్యదర్శి శెట్టి భగత్ రాం మహిళ నాయకురాలు జి. జ్ఞాన సుందరికాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App