
Trinethram News : ప్రహ్లాదుడు గొప్ప విష్ణు భక్తుడు.. ఇది నచ్చని తన తండ్రి హిరణ్య కశ్యపుడు ఎంత చెప్పిన వినడు.. చివరికి విసిగిపోయి కన్న ప్రేమను చంపుకొని ఎన్నో రకాలుగా ప్రహ్లాదడ్ని శిక్షిస్తుంటాడు.. అందులో భాగంగా
ప్రహ్లాదుడిని హిరణ్యకశ్యపుడి యొక్క సోదరి అయిన హోలిక ఒడిలో చితిలో కూర్చోవాలని ఆజ్ఞాపించాడు, ఎందుకంటే మంటల నుండి రక్షించే శాలువాను ఆమె ధరించడం వలన ఆమెకి ఎలాంటి హాని జరగదు. ప్రహ్లాదుడు తన తండ్రి ఆదేశాలను వెంటనే అంగీకరించి, తనను రక్షించమని విష్ణువును వేడుకుంటాడు. మంటలు మొదలైనప్పుడు అందరూ చూస్తుండగానే హోలిక శాలువా ఎగిరి పోవడం వలన ఆమె దహనం అవుతుంది. ఆ శాలువా ప్రహ్లాదుడిని కప్పడం వలన అతడికి ఎటువంటి హాని జరగదు. హోలిక మంటల్లో కాలిపోవటం వల్ల మనం హోలీను జరుపుకుంటున్నాము.
