TRINETHRAM NEWS

What has increased the price of chicken meat

మాసం ప్రియులకు ఇది నిజంగా చేదువార్తే. ఎందుకంటే చికెన్ ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఉత్పత్తి తగ్గిపోవడం, కొను గోళ్లు పెరగడం ధరల పెరుగుదలకు కారణమైంది.. ఏకంగా 300 దాటింది.

కడుపు నిండా చికెన్​ తినాలంటే జేబు కాస్త ఖాళీ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది.

గత కొద్దిరోజులుగా కొండెక్కి కూర్చున్న చికెన్ ధరలు వినియోగదారులకు చుక్కలు చూపించాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో చికెన్ ధరలు భారీగా పెరిగాయి. గత వారం వరకు కిలో చికెన్ రేటు 250-280 రూపాయల మధ్య ఉండగా.. ఇప్పుడు మరింత పెరిగి కిలో ఏకంగా 300 రూపాయలు పలుకుతుంది.

మరో 15 రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వ్యాపారులు అంటున్నారు.

మండుతున్న ఎండలు, వాతావరణంలో మార్పు కారణంగా కోళ్ల ఉత్పత్తి బాగా తగ్గి పోయిందని, జూన్ వరకు ఇదే పరిస్థితి ఉంటుందని అంటున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

What has increased the price of chicken meat