ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
Trinethram News : బంగారం, వెండి ప్రియులకు గుడ్ న్యూస్. వీటి ధరలు మళ్లీ పడిపోయాయి. గత కొన్ని నెలలుగా బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు కనిపించాయి. ప్రధానంగా పండుగల సీజన్లో ఈ ధరలు విపరీతంగా పెరిగాయి. అయితే దీపావళి నుంచి బంగారం, వెండి ధరలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో నిన్నటితో పోల్చితే ఈరోజు ఉదయం 6.25 గంటల నాటికి బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. ఈరోజు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 10 రూపాయలు మాత్రమే తగ్గింది. మరోవైపు వెండి రేటు కూడా కిలోకు 100 రూపాయలు తగ్గింది.
నేటి బంగారం, వెండి ధరలు
ఇదే సమయానికి హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 77,990 స్థాయికి చేరుకోగా, ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 71,490కి చేరుకుంది. మరోవైపు ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 78,140కి చేరగా, 22 క్యారెట్ల పుత్తడి ధర 10 గ్రాములకు రూ. 71,640 చేరుకుంది. ఈ నేపథ్యంలో దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న బంగారం, వెండి రేట్ల వివరాలను ఇప్పుడు చుద్దాం.
దేశంలో ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (10 గ్రాములకు) (24 క్యారెట్స్, 22 క్యారెట్స్)
ముంబైలో రూ. 77,990, రూ. 71,490
వడోదరలో రూ. 78,040, రూ. 71,540
చెన్నైలో రూ. 77,990, రూ. 71,490
విజయవాడలో రూ. 77,990, రూ. 71,490
హైదరాబాద్లో రూ. 77,990, రూ. 71,490
కేరళలో రూ. 77,990, రూ. 71,490
ఢిల్లీలో రూ.78, 140, రూ. 71,640
బెంగళూరులో రూ. 77,990, రూ. 71,490
కోల్కతాలో రూ. 77,990, రూ. 71,490
పూణేలో రూ. 77,990, రూ. 71,490
ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కేజీకి)
ఢిల్లీలో రూ. 91,400
హైదరాబాద్లో రూ. 99,900
విజయవాడలో రూ. 99,900
చెన్నైలో రూ. 99,900
కోల్కతాలో రూ. 91,400
కేరళలో రూ. 99,900
ముంబైలో రూ. 91,400
బెంగళూరులో రూ. 91,400
భువనేశ్వర్లో రూ. 99,900
వడోదరలో రూ. 91,400
అహ్మదాబాద్లో రూ. 91,400.. కేపి
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App