TRINETHRAM NEWS

అర్హులకు పారదర్శకంగా ప్రభుత్వ పథకాల లబ్ధి చేకూరుస్తాం

మంథని మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన వార్డు సభలో పాల్గొన్న

శ్రీ కోయ కలెక్టర్ జిల్లా

మంథని , జనవరి -21: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

ప్రభుత్వం చేపట్టబోయే నాలుగు నూతన పథకాలకు అర్హులను పారదర్శకంగా ఎంపిక చేసి లబ్ధి చేకూరుస్తామని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష  అన్నారు.

మంగళవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మంథని మున్సిపల్ కార్యాలయంలో నూతన ప్రభుత్వ కార్యక్రమాల అమలు పై నిర్వహించిన వార్డు సభలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ,  ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలు ప్రకారం అర్హులందరినీ ఎంపిక చేసి పారదర్శకంగా ప్రభుత్వ పథకాల అమలు చేయడం జరుగుతుందని, ప్రాథమికంగా ప్రకటించిన జాబితాలో ఒకటి రెండు మిస్ అయినా ఎటువంటి ఆందోళన అవసరం లేదని, దరఖాస్తు అందిస్తే వారం పది రోజులలో వాటిని విచారించి పథకాల లబ్ధి చేకూరుస్తామని అన్నారు.

ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో ఎవరికైనా సొంత ఇండ్లు ఉండి ఉంటే సమాచారం అందిస్తే విచారణ చేస్తామని, ఇండ్లు ఉన్న వారి పేర్లు తొలగించడం జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు.

2023 లో వచ్చిన ప్రజా పాలన దరఖాస్తులు, సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే వివరాలు, మీ సేవా దరఖాస్తులను క్రోడీకరించి రేషన్ కార్డుల కొత్తగా అందించేందుకు జాబితా సిద్ధం చేశామని, ఈ జాబితాను ప్రజలు పరిశీలించే అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని, రేషన్ కార్డులకు అర్హులు ఇంకా ఎవరైనా ఉంటే దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు.

ప్రజా పాలన లో వచ్చిన ఇందిరమ్మ ఇండ్లు దరఖాస్తులు, ఇందిరమ్మ ఇండ్ల సర్వే వివరాలను పరిశీలించి అర్హులను ఎంపిక చేశామని అన్నారు. వితంతువులు, దివ్యాంగులు, అత్యంత నిరుపేదలు ప్రాధాన్యతగా జాబితా సిద్ధం చేశామని అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల అర్హులైన ప్రతి ఒక్కరికి అందించడం జరుగుతుందని ఇంకా ఎవరైనా దరఖాస్తు చేసుకోకపోతే దరఖాస్తు అందించాలని కలెక్టర్ తెలిపారు.

ఈ సమావేశంలో మంథని రెవెన్యూ డివిజన్ అధికారి సురేష్, మంథని మున్సిపల్ చైర్ పర్సన్, బంతిని మున్సిపల్ కమిషనర్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App