TRINETHRAM NEWS

We will fight until the second ANMs are made regular

కమీషనర్ కార్యాలయం వద్ద జరిగిన ధర్నాలో ఏఐటియుసి రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఎం నరసింహ వెల్లడి.

హైదరాబాద్ జిల్లా
తేదీ 18 జూలై త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

జాతీయ ఆరోగ్య మిషన్లో గత 17 సంవత్సరాలుగా పనిచేస్తున్న రెండవ ఏఎన్ఎం లను ప్రభుత్వం రెగ్యులర్ చేసే అంతవరకు ఏఐటియుసి ఆధ్వర్యంలో పోరాడుతూనే ఉంటుందని ఏఐటియుసి రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఎం నరసింహ వెల్లడించారు. నేషనల్ హెల్త్ మిషన్ లో పనిచేస్తున్న సెకండ్ ఏఎన్ఎంలను ప్రభుత్వం వెంటనే రెగ్యులర్ చేయాలని కోటిలోని తెలంగాణ వైద్య మరియు ఆరోగ్య శాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ధర్నా అనంతరం వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ కు వినతి పత్రాన్ని సమర్పించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సెకండ్ ఏఎన్ఎం లను బేషరతుగా రెగ్యులర్ చేయాలని, గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని , పి ఆర్ సి 7 నెలల బకాయిలను వెంటనే విడుదల చేయాలని, యాపులను మెర్జ్ చేసి పని ఒత్తిడి తగ్గించాలని తదితర డిమాండ్స్ తో ఏఐటియుసి ఆధ్వర్యంలో గురువారం ఎన్ హెచ్ ఎం కమీషనర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు నరసింహ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ గత ప్రభుత్వంలో వీళ్లను రెగ్యులర్ చేయాలని ఎన్నోసార్లు పోరాటం చేసామన్నారు.

గత సంవత్సరం ఆగస్టు నెలలో జరిగిన సమ్మె సందర్భంగా ప్రస్తుత అధికార పక్ష నాయకులు అప్పుడు ప్రతిపక్షంలో ఉండి సమ్మె శివరాలను సందర్శించి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మిమ్మల్ని కచ్చితంగా రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చారన్నారు. ప్రభుత్వం ఏ పడిన తర్వాత ఎమ్మెల్యేలను, ఎంపీలను , మంత్రులను కలిసామని చివరికి ప్రజా భవన్ కు వెళ్లి సీఎం ఓలో కూడా వెడతలు ఇచ్చామన్నారు. ప్రభుత్వం వైపు నుండి ఎటువంటి స్పందన రాకపోవడంతో నేడు ధర్నాకు దిగాల్సి వచ్చింది అన్నారు. రెండవ ఏఎన్ఎంల ఏ సమస్యలు పరిష్కరించే అంతవరకు ఏఐటియుసి విశ్రమించబోదన్నారు.

రెండవ ఏఎన్ఎంల సంఘం రాష్ట్ర అధ్యక్షులు తోట రామాంజనేయులు
మాట్లాడుతూ గత సంవత్సరంలో సమ్మె చేసినప్పుడు ప్రభుత్వం ఒక కమిటీని నియమించిందని ఇంతవరకు ఆ కమిటీ సమావేశం పరచలేదన్నారు.

పరీక్ష రాయటానికి అవకాశం లేనటువంటి 53 సంవత్సరాలు దాటిన ప్రతి వారికి రిటైర్మెంట్ అయ్యే సమయంలో ఐదు లక్షల రూపాయలు లైఫ్ టైం గ్రాట్యుటీ నీ అందించాలన్నారు. యుపిఎస్సి లో పనిచేసే ఏఎన్ఎంలు అధిక పని ఒత్తిడికి గురవుతున్నారన్నారు. పిహెచ్సి లలో, యూపీఎస్సీలలో ఓకే ఏఎన్ఎం పనిచేస్తున్న సబ్ సెంటర్ కు అదనంగా పదివేల రూపాయలు వేతనాన్ని చెల్లించాలని ఆయన ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 10 లక్షల రూపాయల హెల్త్ ఇన్సూరెన్స్, 10 లక్షల రూపాయల లైఫ్ ఇన్సూరెన్స్ అందించాలని ఆయన ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రెండవ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోయిని శ్యామల, రాష్ట్ర సహాయ కార్యదర్శిలు పి పద్మ, పి జయమ్మ, ఉపాధ్యక్షురాలు హారతి, రాష్ట్ర నాయకు రాళ్లు ,రాజేశ్వరి, గుణవతి , తమ్మిశెట్టి జయమ్మ, యధాలక్ష్మి, పాయం సరోజ, పాయం బాలనాగమ్మ , భూక్య జ్యోతి, సరిత, సావిత్రి, అశ్విని, తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

We will fight until the second ANMs are made regular