
సిఐటియు జిల్లాప్రధాన కార్యదర్శి వి. ఉమామహేశ్వరరావు
అల్లూరిజిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్ మార్చి 7: ఆశ కార్యకర్తలు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని శ్రమ తగ్గ వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఏపీ ఆశ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో గురువారం చలో విజయవాడ కార్యక్రమాన్ని ప్రభుత్వం పోలీసులు చేత నిర్బంధించడం దుర్మార్గమని తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు ఆధ్వర్యంలో గురువారం అరకు వ్యాలీ మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం తీరుకు నిరసనగా పెద్ద ఎత్తున ర్యాలీ, తాసిల్దార్ కార్యాలయం ఆశ కార్యకర్తలు వద్ద ధర్నా నిర్వహించారు.
కార్యక్రమం ఉద్దేశించి సిఐటియు అల్లూరి జిల్లా ప్రధాన కార్యదర్శి వి. ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ఆశా కార్యకర్తలకు గత ఆరు సంవత్సరాల నుండి వేతనాలు పెంచలేదని. దీంతో రోజురోజుకు మార్కెట్లో నిత్యవసర సరుకు ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని ఈ భారాన్ని ఆశా కార్యకర్తలు భరించలేకపోతున్నారని తెలిపారు చాలీచాలని వేతనాలతో కుటుంబ పోషణ కష్టంగా ఉందని అన్నారు. ఆశ కార్యకర్తలకు కనీస వేతనం 26,000 చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్రకటించిన గ్రాడ్ డ్యూటీ, మేటర్నిటీ లీవ్, ఉద్యోగ విరమణ వయసు పెంపు జీవోను తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
గత వైసిపి ప్రభుత్వం ఆయములో కార్మిక ఉద్యమాల పట్ల నిర్బంధ వైఖరి ఈ ప్రభుత్వం కూడా కొనసాగిస్తుందని తెలిపారు. కష్టజీవులు, పేదలు, ఉద్యోగస్తుల పోరాటాలు అణిచివేసే ఏ ప్రభుత్వం అధికారులో కొనసాగలేదని హెచ్చరించారు. కార్మిక పోరాటాల పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు వైఖరి మారలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్స్ యూనియన్ మండల నాయకులు, కొండమ్మ, నాగమణి, సుందరమ్మ స్వామి చంప ఆదివాసి గిరిజన సంఘం మండల నాయకులు కే రామారావు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
