TRINETHRAM NEWS

మూడేళ్లలో అమరావతి నిర్మాణాన్ని పూర్తిచేస్తాం: మంత్రి నారాయణ

Trinethram News : Amaravati: ఏపీ రాజధాని అమరావతి నిర్మాణాన్ని మూడేళ్లలో పూర్తిచేసి తీరుతామని పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. గత ప్రభుత్వం కక్షగట్టి నిర్మాణాలను ఆపేసిందని ఫైర్ అయ్యారు.

ఏపీ రాజధాని అమరావతి నిర్మాణాన్ని మూడేళ్లలో పూర్తిచేసి తీరుతామని పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. న్యాయపరమైన ఇబ్బందులతో పనుల ప్రారంభం ఆలస్యమైందన్నారు. గత ప్రభుత్వం కక్షగట్టి నిర్మాణాలను ఆపేసిందని ఫైర్ అయ్యారు. అవరోధాలను అధిగమించి నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. టెండర్ల ప్రక్రియను ఈ జనవరి నెలాఖరులోపు పూర్తిచేసి ఫిబ్రవరి రెండోవారంలో పనులు ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. ఇప్పటివరకు మొత్తం 40 పనులకు టెండర్లు పిలిచామని తెలిపారు.

వైసీపీ అరాచక పాలన

శుక్రవారం రాజధాని ప్రాంతంలో పర్యటించిన మంత్రి నారాయణ నేలపాడు సమీపంలోని అడ్మినిస్ట్రేటివ్ టవర్లను పరిశీలించారు. అనంతరం మీడియాతో నారాయణ మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. అరాచక పాలన చేపట్టి ప్రజలను భయభ్రాంతులను గురి చేసిందన్నారు.

రాష్ట్రస్థాయి అధికారులందూ ఒకేచోట ఉండేలా..

మంత్రి మాట్లాడుతూ.. తమపై కక్షతో గత వైసీపీ ప్రభుత్వం నిర్మాణాలను ఆపివేసిందని ఆరోపించారు. అమరావతిని విధ్వంసం చేసేందుకు మూడు రాజధానుల అంశాలను తెరపైకి తీసుకొచ్చారని మండిపడ్డారు.‘అమరావతి రాజధాని కోసం రైతులు 34 వేల ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చారు. రాజధానిని ప్రపంచంలో టాప్‌-5లో ఒకటిగా చేయాలనే లక్ష్యంతో ఐకానిక్‌ భవనాల డిజైన్లను నార్మన్‌ ఫాస్టర్‌ చేత చేయించాం. రాష్ట్రస్థాయి అధికారులందూ ఒకేచోట ఉండేలా ఐదు అడ్మినిస్ట్రేటివ్ టవర్లు డిజైన్ చేశాం. అధికారులు, ఉద్యోగులు, జడ్జిల కోసం 2019కు ముందే మొత్తం 4053 అపార్ట్‌మెంట్ల పనులు ప్రారంభించాం. మాపై కక్షతో గత వైసీపీ ప్రభుత్వం నిర్మాణాలను ఆపివేసింది. కోటి 3 వేల చదరపు అడుగుల తో భవనాలు డిజైన్ చేసి పనులు ప్రారంభించాం. అసెంబ్లీని 250 మీటర్ల ఎత్తులో నిర్మించి.. మిగిలిన రోజుల్లో టూరిజం స్పాట్‌గా మార్చాలని డిజైన్లు రూపొందించాం. విద్యుత్ లైన్లు, డ్రైనేజీలు, తాగు నీటి పైపులు అండర్ గ్రౌండ్‌లో ఉండేలా డిజైన్ రూపొందించాం’ అని నారాయణ తెలిపారు.

నిర్మాణాలు మొత్తం నీళ్లలో పెట్టేసింది

‘2015 జనవరి ఒకటో తేదీన ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ ఇస్తే కేవలం 58 రోజుల్లోనే రైతులు 34 వేల ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చారు. కానీ గత ప్రభుత్వం ఈ నిర్మాణాలు మొత్తం నీళ్లలో పెట్టేసింది. నీళ్లలో ఉండటంతో నాణ్యత కోసం ఐఐటీ నిపుణులతో అధ్యయనం చేశాం. విద్యుత్ లైన్లు, డ్రైనేజీలు, తాగు నీటి పైపులు అన్నీ అండర్ గ్రౌండ్‌లో ఉండేలా డిజైన్ చేశాం. గత ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని మొత్తం అడవిగా మార్చేసింది. ఇలా చేసినందుకే ప్రజలు వైసీపీకి తగిన బుద్ధి చెప్పి 11 సీట్లకు పరిమితం చేశారు. వై నాట్ 175 అంటే 11 సీట్లే వచ్చాయి. జనవరి నెలాఖరు లోగా అన్నీ పూర్తి చేసి ఫిబ్రవరి రెండో వారంలో పనులు ప్రారంభిస్తాం. మూడేళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి చేస్తాం’అని మంత్రి నారాయణ వెల్లడించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App