TRINETHRAM NEWS

జర్నలిస్టు ముఖేష్ చంద్రకర్ హత్యను ఖండిస్తున్నాము

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్
జర్నలిస్టుల భద్రత కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలి తెలంగాణ ప్రజా ఫ్రంట్TPF
వికారాబాద్ జిల్లా కమిటీ డిమాండ్ దేశంలో నానాటికి పత్రిక స్వేచ్ఛ దిగజారుతున్నదని నిజాన్ని నిర్భయంగా వెల్లడించే జర్నలిస్టులపై దాడులు,హత్యలు జరుగుతున్నాయనిదీంట్లోభాగంగానే చంద్రకర్ హత్య జరిగిందితెలంగాణ ప్రజా ఫ్రంట్
వికారాబాద్ జిల్లా కమిటీచత్తీస్గడ్ రాష్ట్రం బస్తర్లో ఫ్రీలాన్స్ జర్నలిస్టు ముకేశ్ చంద్రకర్ బస్తర్ జంక్షన్ పేరిటయూట్యూబ్ ఛానల్ ద్వారా అక్కడి ఆదివాసి ప్రజలపైప్రభుత్వాలు కొనసాగిస్తున్న మారణకాండను, అభివృద్ధి పేరుతో రాష్ట్రంలోని ఖనిజ సంపదనుకార్పొరేట్లకుకట్టబెడుతున్న విధానాన్ని తన వార్తల ద్వారా సమాజానికి తెలియజేస్తున్నాడని ఆదివాసుల పైన దళితుల పైన, మైనార్టీల పైనమిషనరీలపైన జరుగుతున్న దాడులను వార్తల రూపంలోచూపిస్తున్నాడని 120 కోట్ల రహదారినిర్మాణంలోజరిగినఅవినీతి అక్రమాలను వెలికి తీసినందుకేఅతన్ని ప్రభుత్వం హత్యచేసిందని,ఇందులోకాంట్రాక్టర్లతో సహా కేంద్ర రాష్ట్రప్రభుత్వాలదే ఈ హత్యకు బాధ్యతలుగత ఏడాది ఫ్రాన్స్ కు చెందిన రిపోర్టర్ వితౌట్ బోర్డర్స్ సంస్థ విడుదల చేసిన వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ లో 180 దేశాలకు గాను భారతదేశం 159 స్థానంలో ఉన్నదని, పత్రికా స్వేచ్చ తీవ్ర ఆందోళనకరంగా ఉన్న 31 దేశాల్లో భారత్ కూడా ఉండడం, అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమనిచెప్పుకునే భారత్లో ఈ పరిస్థితులు చాలా దుర్మార్గమైనచర్యగా భావిస్తుంది తెలంగాణ ప్రజా ఫ్రంట్.

దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పత్రిక స్వేచ్ఛ కోసం ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తూ ది హిందూ ఎడిటర్ రామ్, హక్కుల నాయకులు ప్రశాంత్ భూషన్ లు సుప్రీంకోర్టుకు వెళ్లిన విషయాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరువరాదని అన్నారు. ప్రభుత్వ విధానాలు ప్రశ్నించినందుకు గతంలో కల్బురి , గౌరీ లంకేష్ మొదలు ఇప్పుడు చంద్రకర్ వరకు ఎందరోజర్నలిస్టులు అసువులు బాసారనిఅన్నారు గతంలో గుజరాత్ మారణహోమం గురించి ప్రసారాలు చేసినందుకుబీబీసీయాజమాన్యంపై ఐటి దాడులు చేసి భయభ్రాంతులకు గురిచేసారని, ది హిందూ, ది వైర్, న్యూస్ క్లిక్ మీడియాలకు విదేశాల నుండి నిధులువస్తున్నాయని తప్పుడు కేసులతో అనేక ఆంక్షాలువిధించడంచాలాదారుణమైన విషయం.
ఇప్పటికైనా దేశ వ్యాప్తంగాజర్నలిస్టుల పైన జరుగుతున్న దాడులను,హత్యలను అరికట్టాలని జర్నలిస్టుల భద్రత కోసం కఠినమైన ప్రత్యేక చట్టం తీసుకురావాలని, ఫ్రీలాన్స్ జర్నలిస్టు చంద్రకర్ హత్య కేసునిందుతులను కఠినంగాశిక్షించాలని, మృతుని కుటుంబానికి 10 కోట్ల ఎక్స్ గ్రేషియో చెల్లించాలని ఈ సందర్భంగా తెలంగాణ ప్రజా ఫ్రంట్ వికారాబాద్ జిల్లాకన్వీనర్ నాగభూషణం కమిటీ సభ్యులు విశ్వనాథం గోపాల్,సాయిలు జంగయ్య కేంద్ర రాష్ట్రప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాంతెలంగాణ ప్రజా ఫ్రంట్ వికారాబాద్ జిల్లా కమిటీ

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App