గోదావరిఖని లోని 33వ డివిజన్లో ఘనంగా ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటర్ నమోదు కార్యక్రమం
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
అధిక సంఖ్యలో ఓటరు నమోదు కార్యక్రమంలో పాల్గొన్న పట్టభద్రులు
పట్టభద్రులైన యువతి యువకులు కోసం పోరాడే ఎమ్మెల్సీ అభ్యర్థిని ఎన్నుకోవాలని పిలుపునిచ్చిన మద్దెల దినేష్
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఉమ్మడి ఆదిలాబాద్ – నిజామాబాద్ – కరీంనగర్ – మెదక్ జిల్లాలో ఫిబ్రవరి జరగనున్న ఎన్నికల సంబంధించి పట్టభద్రులైన ఓటరు నమోదు ప్రక్రియ గోదావరిఖని లోని 33వ డివిజన్ లో మద్దెల దినేష్ ఆధ్వర్యంలో ఉచిత ఓటర్ నమోదు కార్యక్రమం డిజిటల్ లీగల్ సర్వీస్ ఆధ్వర్యంలో నిర్వహించబడిందన్నారు.
అనంతరం మద్దెల దినేష్ మాట్లాడుతూ ఉమ్మడి ఆదిలాబాద్-నిజామాబాద్-కరీంనగర్ – మెదక్ జిల్లాల పరిధిలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనుండగా ఓటరుగా నమోదు చేసుకునేందుకు పట్టభద్రులు 33వ డివిజన్ లో యువతి యువకులు వంద మందికి పైగా రావడం జరిగిందన్నారు.
ఉమ్మడి నాలుగు జిల్లాల్లోని 42 అసెంబ్లీ నియోజకవర్గాల్లో లక్షల్లో గ్రాడ్యుయేట్స్ ఉన్నారని సరైన ప్రచారం లేక చాలామంది ఓటరుగా దరఖాస్తు చేసుకోకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోందన్నారు.
పట్టభద్రుల విద్యార్హతల ప్రొవెజీనల్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ, ఫోటో తదితర వివరాలను సేకరించి ఓటరు నమోదు ప్రక్రియను పూర్తిచేసామన్నారు. 2021 అక్టోబరు 31 వరకు డిగ్రీ పూర్తిచేసిన వారు ఓటరుగా అర్హులు అని వారివి అన్ని ఓటర్ నమోదు చేశామని పేర్కొన్నారు.
ఓటు హక్కు డిగ్రీ పూర్తి అయిన వారు ప్రతి ఒక్కరూ నమోదు చేసుకోవాలని పట్టభద్రుల కొరకు పోరాడే వ్యక్తిని ఎమ్మెల్సీ గా ఎన్నుకోవాలని యువతకు మద్దెల దినేష్ పిలుపునిచ్చారు.
ఓటరు నమోదు కార్యక్రమంలో అధిక సంఖ్యలో యువతి యువకులు పాల్గొని ఓటు నమోదు చేసుకున్నారన్నారు.
డిజిటల్ లీగల్ ఆన్లైన్ సర్వీసెస్ సర్వీసెస్ నిర్వాహకులు గంగారపు ప్రసాద్, నరేష్ ప్రత్యేక ధన్యవాదాలు.
ఇంకా ఈ కార్యక్రమంలో 33వ డివిజన్ యువకులు ఏం. శ్రీనివాస్, బొడ్డు వేణు, గాంగరపు ప్రసాద్, ఏం. గౌస్, పేర్క శ్రీనివాస్, రామచంద్ర, శనిగరపు ప్రసాద్, మండల శ్రీనివాస్, కృష్ణ, లావణ్య, సమత, తదితరులు పాల్గోన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App