నెల్లూరు నగరంలోని నవాబుపేట శివాలయంలో అర్చక బృందం ఏర్పాటు చేసిన కార్తీక వన భోజన మనోత్సవం, అలాగే పల్లిపాడు గాంధీ ఆశ్రమంలో విశ్వబ్రాహ్మణ కార్తీక వన భోజన మహోత్సవ కార్యక్రమాలలో నగర శాసనసభ్యులు డాక్టర్ పి. అనీల్ కుమార్ పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, కార్తీక వన భోజన కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం గాంధీ ఆశ్రమంలో ఉన్న మహాత్మా గాంధీ, పొణకా కనకమ్మ గార్ల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్తీకమాసం సందర్భంగా కార్తీక వన భోజనాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని, ఆ పరమేశ్వరుని కృపాకటాక్షాలు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి గారికి, నగర ప్రజలకు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు దామవరపు రాజశేఖర్, పోట్లూరి రామకృష్ణ ఆచారి, వై.ఎస్.ఆర్.సి.పి. నాయకులు ఇలపాక శివకుమార్ ఆచారి, ఖజానా శేషయ్య ఆచారి, తదితరులు పాల్గొనారు.
పల్లిపాడు గాంధీ ఆశ్రమంలో విశ్వబ్రాహ్మణ కార్తీక వన భోజన మహోత్సవ
Related Posts
తెలుగుదేశం పార్టి వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతిని ఘనంగా నిర్వహించిన, యం.వి.వి
TRINETHRAM NEWS తెలుగుదేశం పార్టి వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతిని ఘనంగా నిర్వహించిన, యం.వి.వి ఆంధ్రప్రదేశ్, త్రినేత్రం న్యూస్, జిల్లా ఇంచార్జ్ : అల్లూరి జిల్లా, పాడేరు నియోజకవర్గం, కొయ్యూరు మండలం, రాజేంద్రపాలెం గ్రామంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి,…
Lakshmi Parvati : 30 ఏళ్లుగా ఈ దుర్మార్గులు నన్ను వేధిస్తున్నారు
TRINETHRAM NEWS 30 ఏళ్లుగా ఈ దుర్మార్గులు నన్ను వేధిస్తున్నారు Trinethram News : లక్షలాది మంది ముందే ఎన్టీఆర్ నన్ను పెళ్లి చేసుకున్నాడు.. భార్యగా ఇంటికి తీసుకొచ్చాడు ఆయన ఆనందం కోసం, ఆరోగ్యం కోసం సేవ చేశా.. చివరికి కొందరి…