TRINETHRAM NEWS

Trinethram News : సార్వత్రిక సమరంలో భాగంగా ఏపీలో లోక్‌సభ, శాసనసభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. నేటి నుంచి ఈ నెల 25 వరకు పార్లమెంటరీ, అసెంబ్లీ నియోజకవర్గాల్లో నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుంది..

ఈ నేపథ్యంలో ఇవాళ రాష్ట్రంలో ప్రధాన పార్టీలు, ఇతర పార్టీల అభ్యర్థులు నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కూడా ఇవాళ నామపత్రాలు దాఖలు చేయనున్నారు..

విశాఖ ఎంపీగా, గాజువాక నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా తాను పోటీ చేస్తున్నట్లు కేఏ పాల్ తెలిపారు. ఈ రెండు స్థానాలకు ఇవాళ నామినేషన్ దాఖలు చేస్తానని చెప్పారు. తాను పార్లమెంట్‌ సభ్యునిగా గెలిస్తే స్టీల్‌ ప్లాంట్‌ ప్రయివేటీకరణను ఆపడానికి తీవ్రంగా ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. ఇక గాజువాక నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైతే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సమస్యలను పరిష్కరిస్తాని తెలిపారు. ఈ ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తమ పార్టీ టికెట్ల కోసం మూడు వేల మంది దరఖాస్తు చేసుకున్నారని, అందులో అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేసి రాష్ట్రంలోని వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల్లో బరిలోకి దించుతామన్నారు..