TRINETHRAM NEWS

Violence against a six-month-old child

మొన్న నంద్యాలలో జరిగిన సంఘటన మరిచిపోక ముందే నేడు విజయనగరం లో దారుణం

Trinethram News : రామభద్రాపురం:

విజయనగరం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఆరునెలల చిన్నారిపై వరుసకు తాత అయిన వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో రక్తస్రావమైంది.

ఊయలలో ఉండగానే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. రామభద్రాపురం మండలంలో శనివారం ఈ ఘటన జరిగింది.

బొబ్బిలి డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నారిని తల్లి ఊయలలో వేసి గ్రామంలోని కిరాణా దుకాణానికి వెళ్లింది. ఇంట్లో ఎవరూ లేని ఈ సమయంలో నార్లవలస గ్రామానికి చెందిన బోయిన ఎరకన్న దొర అక్కడికి వచ్చి చిన్నారిపై అత్యాచారం చేశాడు. దీంతో గట్టిగా ఏడ్చింది. ఏడుపు విని చిన్నారి అక్క (పెద్ద కుమార్తె) అక్కడికి చేరుకుని వెంటనే తల్లికి సమాచారం అందించింది.
ఈ క్రమంలో తల్లితో పాటు గ్రామస్థులు నిందితుడిని పట్టుకునేందుకు వెంబడించగా పరారయ్యాడు. అనంతరం చిన్నారిని బాడంగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం విజయనగరంలోని ఘోష ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యంగా ఉన్నట్లు సమాచారం. డీఎస్పీ శ్రీనివాసరావు ఆ గ్రామానికి వెళ్లి విచారణ చేపట్టారు. స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అనంతరం నార్లవలస వెళ్లి నిందితుడిని అరెస్ట్‌ చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Violence against a six-month-old child