TRINETHRAM NEWS

అల్లూరి జిల్లా త్రినేత్రం న్యూస్ అరకు నియోజవర్గం అనంతగిరి ఏప్రిల్ 3: ఈ నెల ఏడవ తేదీన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ అరకు పర్యటన నేపథ్యంలో అనంతగిరి మండలం కొండిబ పంచాయతీ లో గల ప్రజలు తమ గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టిలో పెట్టండి అని కోరుతూ అన్ని విధాలుగా ఆదుకోవడం లో పవన్ కళ్యాణ్ ముందున్నారు కావున మా సిసాముండా, కోసమామిడి, కప్పటి వలస, కొత్తవలస, ఆంబోట్ మామిడి, రంజనివలస, బలియగూడ, బలమమిడి, బోరింగువలస, జామగడ,* రోడ్డు సమస్య లు వారి దృష్టిలో పెట్టాలని అలాగే స్థానిక సమస్య లు త్రాగునీరు, సాగునీరు, డ్రైనేజి, సిసి రోడ్డు, తదితర అంశలు ప్రస్థావించారు, చిట్టం మురళి మాట్లాడుతూ ఖచ్చితం ప్రతి అంశాన్ని డిప్యూటీ సీఎం దృష్టిలో పెడతానని వారికీ మురళి హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో
జన్ని సింహద్రి, కొర్ర అప్పన్న, పిసా ఉపాధ్యక్షులు సారా అప్పన్న, పిసా కార్యదర్శి గెమ్మెల సన్యాసి, గెమ్మెల అప్పారావు, మిరియాల రాజు, కొర్ర సన్యాసి దొర, సోమేలా మచ్చుబాబు, తదితరులు జనసేన మండల అధ్యక్షులు చిట్టం మురళికి వినతి పత్రం అందించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Villagers have written a petition