Trinethram News : అనంతపురము జిల్లా,
బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన “వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర” కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్, ఉమ్మడి అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ, శాసన సభ సభ్యులు శ్రీ జొన్నలగడ్డ పద్మావతి,అనంతపురము పార్లమెంట్ సభ్యులు శ్రీ తలారి రంగయ్య, జిల్లా కలెక్టర్ శ్రీమతి గౌతమి, జాయింట్ కలెక్టర్ శ్రీ కేతన్ గార్గ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రంలో ప్రతి ఇంటిని ప్రజా ప్రతినిధులు, అధికార యంత్రాంగం ద్వారా గడప గడపకు మన పభుత్వం, జగనన్న సురక్ష లాంటి కార్యక్రమాల ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందేలా చేస్తున్నారని, ఇదే పంధాలో కేంద్ర ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ అందాలనే ఉద్దేశంతో “వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర” కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషకరమని, ప్రజలందరూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలను అందిపుచ్చుకుని ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో స్థానిక జడ్.పి.టి.సి, యం.పి.పి, సర్పంచు, ఇతర ప్రజా ప్రతినిధులు, వివిధ కార్పోరేషన్ చైర్ పర్సన్లు, డైరెక్టర్లు, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, మండల స్థాయి అధికారులు, పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.