TRINETHRAM NEWS

వికారాబాద్ మండల BRS పార్టీ అధ్యక్షులుగా మహిపాల్ రెడ్డి

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ కార్యనిర్వాహక అధ్యక్షులుగా పడిగళ్ల అశోక్: మెతుకు ఆనంద్
వికారాబాద్ పట్టణం ఎన్నెపల్లి లోని BRS భవన్ జిల్లా BRS పార్టీ కార్యాలయం లో నిర్వహించిన వికారాబాద్ మండల BRS పార్టీ నాయకుల మరియు కార్యకర్తల అంతర్గత సమావేశానికి హాజరైన వికారాబాద్ జిల్లా BRS పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ .సమావేశంలో భాగంగా వికారాబాద్ మండల గ్రామాల BRS పార్టీ నాయకులు కార్యకర్తల అభిప్రాయం మేరకు మహిపాల్ రెడ్డి ని వికారాబాద్ మండల BRS పార్టీ అధ్యక్షులు గా మరియు పడిగళ్ల అశోక్ ను వికారాబాద్ మండల BRS పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుల గా నియమించారు.
ఈ కార్యక్రమంలో మాజీ TSEWIDC చైర్మన్ నాగేందర్ గౌడ్ , మాజీ BC కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్, మాజీ ఎంపీపీ చంద్రకళ కమాల్ రెడ్డి , మాజీ సర్పంచ్ ల సంగం అధ్యక్షులు పురుషోత్తం రెడ్డి, మండల సమన్వయ కమిటీ సభ్యులు, మాజీ సర్పంచ్ లు, మాజి MPTC లు, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Vikarabad Mandal BRS Party