Vigilance inquiry should be conducted on petrol diesel scam
అవినీతికి కేరాఫ్ రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయం
తీరుమారని పారిశుద్ద్య విభాగం అధికారులు
పెట్రోల్ డీజిల్ కుంభకోణం పై విజిలెన్స్ విచారణ జరిపించాలి
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
డి హెచ్ పి ఎస్ నాయకుల డిమాండ్
రామగుండం నగరపాలక సంస్థ లోని పారిశుద్ద్య విభాగం అంటేనే అవినీతికి చిరునామాగా మారిందని
పారిశుద్ధ్య విభాగంలో విచ్చలవిడిగా అవినీతి ఏరులై పారుతుందని డిహెచ్పిఎస్ జిల్లా కార్యదర్శి కందుకూరి రాజారత్నం రాష్ట్ర సమితి సభ్యులు మద్దెల దినేష్ నగర కార్యదర్శి ఎర్రల రాజయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.
50 డివిజన్లలో చెత్త సేకరణ కొరకు వాహనాలు తిరగనికి పెట్రోల్ డీజిల్ కుంభకోణానికి సంబంధించిన పారిశుద్ధ విభాగం అధికారి తెరలేపడంతో వారి బండారం మొత్తం బయటపడిందని ఉదాహరణకు వారానికి 24 లీటర్ల పెట్రోల్ పోయాల్సింది పోయి వారు ఇష్టం వచ్చిన అంత 30 నుంచి 40 లీటర్లు వాహనాల్లో పోయించామని బిల్లులు రాసుకుంటూ అందిన కాడికి దండుకుంటూ పబ్బం గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రామగుండం నగరపాలక సంస్థ లోని ప్రధాన శాఖ అయినటువంటి పారిశుద్ధ్య విభాగం అంటేనే అవినీతికి పెట్టింది పేరని అందిన కాడికి దోచుకొని ఇష్టానుసారంగా బిల్లులు పెట్టుకోవడమే వీరు పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు.
వాహనాలకు సంబంధించి పెట్రోల్ డీజిల్ రిపేర్లు తదితర వాటికి 26 నుంచి 30 లక్షల వరకు బిల్లును తీసుకునేదని గతంలో ఉన్న కమిషనర్ దృష్టికి ఇదంతా పారిశుధ్య విభాగం అధికారి ఇష్టానుసారంగా బిల్లులు పెడుతున్నారని కేవలం 12 నుంచి 15 లక్షల వరకే ఖర్చు అవుతుందని ప్రతినెల తెలియజేయడంతో గత కమిషనర్ చొరవ తీసుకొని 15 లక్షల వరకే వాహనాలకు ఖర్చవుతున్నాయని పేర్కొన్నారు.
ఇప్పుడు ఉన్నటువంటి పారిశుద్ధ్య విభాగాధికారికి అండగా ఉన్నటువంటి కొంతమంది ప్రజాప్రతినిధులకు విచ్చలవిడిగా పెట్రోల్ డీజిల్ వారి సొంత వాహనాలకు పోయిస్తూ వారి అండతో ఇప్పుడు పెట్రోల్ డీజిల్ కుంభకోణానికి తెరలేపి ప్రజాధనాన్ని తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారని ఇలాంటి అవినీతి అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా సమగ్ర విజిలెన్స్ విచారణ చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకుండా కాపాడాలని డిహెచ్పిఎస్ దళిత హక్కుల పోరాట సమితి పక్షాన డిమాండ్ చేసారు.
ఇట్టి పెట్రోల్ డీజిల్ కుంభకోణంపై లోకల్ బాడీస్ కలెక్టర్ మరియు నగరపాలక సంస్థ కమిషనర్ త్వరితగతంగా అవినీతికి పాల్పడుతున్న అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App