TRINETHRAM NEWS

అల్లు అర్జున్‌ రెగ్యులర్ బెయిల్‌ పిటిషన్‌పై నేడు తీర్పు ..

Trinethram News : హైదరాబాద్:జనవరి 03
సంధ్య థియేటర్‌ తొక్కిస లాట ఘటన కేసులో అల్లు అర్జున్‌ బెయిల్‌ పిటిషన్‌పై నాంపల్లి కోర్టు నేడు తీర్పు వెల్లడించనుంది. అల్లు అర్జున్‌ బెయిల్‌ పిటిషన్‌పై ఇప్పటికే వాదనలు ముగియడంతో నేడు తీర్పు ఇవ్వనుంది.

దాంతో.. అల్లు అర్జున్‌ బెయిల్‌ పిటిషన్‌పై నాంపల్లి కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందన్నది ఉత్కంఠ రేపుతోంది. ఇక.. సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందడం తో.. ఆమె మృతికి అల్లు అర్జునే కారణమంటూ చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.

దీనికి సంబంధించి పోలీసులు, అల్లు అర్జున్‌ తరపు లాయర్ల వాదనలు పూర్తవడంతో నాంపల్లి కోర్టు నేడు తీర్పు వెల్లడించబో తోంది. ఈ కేసులో ఇప్పటికే అల్లు అర్జున్‌ మధ్యంతర బెయిల్‌పై ఉన్నారు.

మరోవైపు డిసెంబర్ 30వ తేదీన అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్‌పై నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను జనవరి 3కు వాయిదా వేసింది. ఆ సమయంలో అల్లు అర్జున్ వేసిన బెయిల్ పిటిషన్‌పై పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App