విక్టరీ వెంకటేశ్ తో పాటు హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్, సైంధవ్ టీమ్ వివిధ సిటీలు తిరుగుతూ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న దేశవ్యాప్తంగా విడుదల కానుంది.
గుంటూరులో కాలేజీ విద్యార్థులతో కలిసి వెంకటేశ్ సందడి చేశారు. విద్యార్థుల మధ్య క్రికెట్ పోటీలను ప్రారంభించారు. ఈ క్రమంలో వెంకటేశ్ కాసేపు బ్యాటింగ్ చేసి విద్యార్థులను అలరించారు.