
వికారాబాద్ జిల్లా ప్రతినిధి న్యూస్ వాహనాల వేలం పాటు పారదర్శకంగా, న్యాయమైన రీతిలో వదిలివేయబడినగుర్తు తెలియని 148 వాహనాల వేలం జిల్లా ఎస్పీ కె.నారాయణ రెడ్డి,IPS. జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రం DTC, వికారాబాద్‌లో 148 వాహనాల బహిరంగ వేలం నిర్వహించడం జరిగింది.ఈ వేలం కార్యక్రమంలో వదిలివేయబడిన లేదా గుర్తు తెలియని వాహనాలను నిబంధనల ప్రకారం వేలం వేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, వేలం ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా, న్యాయమైన రీతిలో నిర్వహించబడిందని, అందరూ స్వేచ్ఛగా పాల్గొని న్యాయమైన ధరలకు వాహనాలను కొనుగోలు చేసేందుకు అవకాశం కల్పించబడిందని చెప్పారు.ఈ వాహనాలపై ఎవరికైనా యాజమాన్య హక్కులు ఉంటే, వారు గతంలో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించబడిందని, నిబంధనలకు అనుగుణంగా దర్యాప్తు చేసిన తర్వాతనే వేలం చేపట్టినట్లు ఎస్పీ వివరించారు.
కార్యక్రమంలో వాహనాల వేలం కమిటీ ఛైర్మన్ జిల్లా అదనపు ఎస్పీ శ్రీ టి.వి. హనుమంత్ రావు ,ఏఓ జోతిర్మని , ఏఆర్ డిఎస్‌పి వీరేష్ ,ఆర్‌ఐ లు, ఆర్‌ఎస్‌ఐ లు , వేలం క్రయదారులు పాల్గొన్నారు. వేలం విజయవంతంగా పూర్తిచేసి ఆదాయాన్ని సంబంధిత విభాగానికి అప్పగించడం జరిగింది
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
