
Trinethram News : ఆదికవి నన్నయ యూనివర్సిటీ ఎం.ఎస్.ఎన్. క్యాంపస్ ను వీసీ ఆచార్య ఎస్. ప్రసన్నశ్రీ ఆకస్మిక తనిఖీ చేశారు. క్యాంపస్ ప్రాంగణాలను, కార్యాలయాలను, వసతీ గృహాలు పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు తెలియజేశారు. క్యాంపస్ ప్రిన్సిపాల్ కార్యాలయంలో సిబ్బంది హాజరు, పనితీరుపై ప్రిన్సిపాల్ ఆచార్య ప్రశాంతిశ్రీ ని అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం పీజీ అడ్మిషన్లు జరుగుతున్న నేపధ్యంలో అన్ని కోర్సులు సీట్లు పూర్తి స్థాయిలో భర్తీ అయ్యే విధంగా కార్యాచరణ రూపొందించాలన్నారు. అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది క్రమశిక్షణతో సమయపాలన పాటించాలని, విద్యార్థులను సొంత పిల్లలుగా భావించి విద్యాబుద్దులు నేర్పించాలని తెలియజేశారు.
అందరికీ ఉన్నత విద్య అందించాలనే మల్లాడి సత్యలింగం నాయకర్ వంటి మహనీయుల ఉన్నత లక్ష్యాలు ఈ క్యాంపస్ ద్వారా సాకారం కావాలని, దానికి ప్రతీ ఒక్కరు కృషి చేయాలన్నారు. తర్వాత వసతి గృహాన్ని సందర్శించిన వీసీ సిబ్బందిపై సీరియస్ అయ్యారు. వసతి గృహాన్ని, మెస్ ను పరిశుభ్రంగా ఉంచుకోవాలని నాణ్యమైన భోజన విద్యార్థులకు అందించాలని అన్నారు. క్యాంపస్ ను పరిశుభ్రంగా ఉంచుకోవడంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే చక్కని వాతావరణంలో చదువుకోవడానికి వీలవుతుందని చెప్పారు. సమష్టిగా పని చేసి కాకినాడ ఎం.ఎస్.ఎన్. క్యాంపస్ కు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
