TRINETHRAM NEWS

Trinethram News : రాజమహేంద్రవరం, తేదీ:9.2.2024

తూర్పు గోదావరి జిల్లా కు జిల్లా పాఠశాల విద్యా అధికారి గా కే. వాసుదేవ రావు శుక్రవారం ఉదయం బాధ్యతలు చేపట్టిన
అనంతరం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలక్టర్ డా కే. మాధవీలత ను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందచేశారు.

త్వరలో నిర్వహించ నున్న 10 వ తరగతి పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించడం కోసం ప్రత్యేక దృష్టి సారించాలనీ జిల్లా కలక్టర్ మాధవీలత ఆదేశించారు.

ఇప్పటి వరకూ కే. వాసుదేవ రావు విజయనగరం జిల్లా లో ఉప పాఠశాల విద్యా అధికారి గా బాధ్యతలు నిర్వహించిన వాసుదేవ రావు జిల్లా పాఠశాల విద్యా అధికారి గా బదలీపై జిల్లాకు రావడం జరిగింది.

జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి, రాజమహేంద్రవరం వారిచే జారీ.