TRINETHRAM NEWS

 Trinethram News : ఉత్తరాంధ్ర టీచర్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గాదె శ్రీనివాసులు నాయుడు విజయం సాధించారు. తొలుత తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ముగిసింది. అనంతరం రెండో రౌండ్, మూడో రెండ్​లో పలువురు ఎలిమినేట్ అయ్యారు. రెండో రౌండ్‌లో అభ్యర్థి శివప్రసాదరావు, మూడో రౌండ్‌లో అభ్యర్థి పద్మావతి ఎలిమినేట్ అయ్యారు.

తొలి ప్రాధాన్యత ఓట్లలో పీఆర్‌టీయూ అభ్యర్థి శ్రీనివాసులుకు 7,210 ఓట్లు, కూటమి, ఏపీటీఎఫ్‌ మద్దతు అభ్యర్థి రఘువర్మకు 6,845 ఓట్లు వచ్చాయి. అదే విధంగా యూటీఎఫ్‌ అభ్యర్థి విజయగౌరి 5,804 ఓట్లు సాధించారు. దీంతో తొలి ప్రాధాన్యత ఓట్లలో ఫలితం తేలలేదు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కించారు.

రెండు, మూడు రౌండ్లలో పలువురు ఎలిమినేట్​ అయ్యారు. రెండో రౌండ్‌లో అభ్యర్థి శివప్రసాదరావు, మూడో రౌండ్‌లో అభ్యర్థి పద్మావతి ఎలిమినేషన్ అయినట్లు అధికారులు ప్రకటించారు. కాగా ఉత్తరాంధ్ర టీచర్‌ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో మ్యాజిక్ ఫిగర్ 10,068 ఓట్లు సాధించిన అభ్యర్థి విజేతగా నిలిస్తారు. నాలుగో రౌండ్ పూర్తయ్యే సరికి శ్రీనివాసులు 7,230, రఘువర్మ 6,859 ఓట్లు సాధించారు.

అనంతరం నాలుగో రౌండ్‌లో రాధాకృష్ణ, ఐదో రౌండ్‌లో సత్యనారాయణ, ఆరో రౌండ్‌లో శ్రీనివాసరావు, ఏడో రౌండ్‌లో దుర్గాప్రసాద్, ఎనిమిదో రౌండ్‌లో సూర్యప్రకాష్ వరుసగా ఎలిమినేట్ అయ్యారు. మొత్తం 20,783 ఓట్లలో వెయ్యికి పైగా చెల్లని ఓట్లుగా నమోదు అయ్యారు. మొత్తం 19,813 ఓట్ల లెక్కించారు. విజయం సాధించాలంటే మ్యాజిక్‌ ఫిగర్‌ 10,068 ఓట్లు రావాలి. ఓట్ల లెక్కింపులో భాగంగా రెండో ప్రాధాన్యత ఓట్లతో గాదె శ్రీనివాసులు విజయం సాధించినట్లు అధికారులు తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

 Gade Srinivasulu Naidu wins