TRINETHRAM NEWS

Use helicopters if necessary.. Minister Ponguleti’s key instructions to the officers

Trinethram News : Telangana : తక్షణమే అక్కడ సహాయక చర్యలు చేపట్టాలి, అవసరమైతే హెలికాప్టర్లు వినియోగించాలి రెవెన్యూ, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు.రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, వరద ముప్పు పరిస్థితులపై ఈరోజు ఉదయం నుంచి జిల్లా కలెక్టర్లు, డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులతో సమీక్ష పొంగులేటి సమీక్ష జరుతున్నారు

ఈ సమీక్షలో వర్షాభావం ఎక్కువగా ఉన్న ఖమ్మం, కొత్తగూడెం, వరంగల్ , సూర్యాపేట, నల్గొండ, హైదరాబాద్ తదితర జిల్లాలో నెలకొన్న పరిస్థితులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల ఎలాంటి పరిస్థితులు ఎదురైన ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలని జిల్లా కలెక్టర్లను అప్రమత్తం చేశారు.

అలాగే వరద ముప్పు ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేయాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, అవసరమైన ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. అంతేగాక రెస్క్యూటీమ్‌లు, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు, అవసరమైతే రక్షణ చర్యలకు హెలికాప్టర్లు వినియోగించాలని చెప్పారు.

విపత్తుల నిర్వహణ విభాగం అధికారులు సిబ్బంది 24 గంటల పాటు సచివాలయంలో అందుబాటులో ఉండాలని, విద్యుత్, తాగునీటికి, రాకపోకలకు అంతరాయాలు కలగుకుండా చూసుకోవాలన్నారు. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో నెలకొన్న పరిస్థితులపై ఆ జిల్లా కలెక్టర్ ను అడిగి తెలుసుకున్నారు. తక్షణమే అక్కడ సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఎక్కడా కూడా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరకుండా తక్షణం చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచనలు చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Use helicopters if necessary.. Minister Ponguleti's key instructions to the officers