TRINETHRAM NEWS

కుంభమేళా పై తప్పుడు ప్రచారం చేస్తే తాట తీస్తాం : యూపీ సీఎం యోగి

Trinethram News : Uttar Pradesh : ప్రయాగ్‌రాజ్‌ కుంభమేళాపై సోషల్‌మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై ఉత్తరప్రదేశ్‌లో యోగి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ప్రయాగ్‌రాజ్‌ కుంభమేళాలో చలితీవ్రతతో 11 మంది చనిపోయారని సోషల్‌మీడియాలో పోస్ట్‌ పెట్టిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చలిని తట్టుకోలేక చాలామంది ఆస్పత్రుల పాలయ్యారని, అధికారులు పట్టించుకోవడం లేదని పోస్ట్‌ పెట్టిన లలూ యాదవ్‌ సంజీవ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. సంజీవ్‌ సమాజ్‌వాదీ పార్టీ కార్యకర్తగా చెప్పుకుంటున్న లలూ యాదవ్ సంజీవ్‌గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.

కుంభమేళాపైసోషల్‌మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన వాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి(UP CM Yogi) ఇప్పటికే ప్రకటించారు. లక్నోలో ముఖ్యమంత్రి నైట్‌ షెల్టర్‌ను సందర్శించారు.దుప్పట్లు , స్వెట్లర్లను పంపిణీ చేశారు. భక్తుల్లో అశాంతిని , అలజడిని రేపేందుకు కొంతమంది కుట్రలు చేస్తున్నారని యోగి ఆరోపించారు.. ఇలా తప్పుడు ప్రచారం చేస్తే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.

మరోవైపు,ప్రయాగ్‌రాజ్‌ కుంభమేళా నాలుగో రోజుకు చేరుకుంది. భక్తులతో, సాధువులతో ప్రయాగ్‌రాజ్‌ త్రివేణి సంగమం కిటకిటలాడుతోంది. భక్తులు, స్వామీజీలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాటు చేసినట్టు సీఎం యోగి తెలిపారు. కుంభమేళా ప్రాంగణంలో వైద్య శిబిరాలు 24 గంటల పాటు పనిచేస్తునట్టు తెలిపారు. భక్తులు అస్వస్థతకు గురైతే వెంటనే చికిత్స అందించేందుకు వైద్యసిబ్బందిని అందుబాటులో ఉంచారు. కుంభమేళాను ఇప్పటికే కోట్లాదిమంది భక్తులు సందర్శించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App