TRINETHRAM NEWS

జమిలికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం

బిల్లుకు పార్లమెంట్ ఆమోదముద్రే తరువాయి

Trinethram News : Jamali Elections : జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం లభించింది.

జమలి ఎన్నికలంటే దేశ వ్యాప్తంగా ఒకే విడతలో ఎన్నికలు అనగా లోక్ సభ ఎన్నికలతో పాటే వివిధ రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకే దఫా ఎన్నికలు నిర్వహించడం. అందుకోసమే కేంద్రం ఈ బిల్లు తీసుకొచ్చింది.

భారత మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ప్రభుత్వం నియమించిన కమిటీ ఈ బిల్లుకు సంబంధించి పలు సిఫారసులు చేసింది. అనంతరం బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఇక మిగిలింది బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందడమే.

బిల్లుకు పార్లమెంట్ ఆమోదముద్ర పడితే వివిధ రాష్ట్రాల అసెంబ్లీలకు, లోక్ సభకు ఒకేసారి ఎన్నికలు జరగనున్నాయి.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App