
పెనుమూరు త్రినేత్రం న్యూస్. పెనుమూరు మండలంలో బీసీ కార్పొరేషన్ రుణాల కోసం నిరుద్యోగ అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. దానికి ఈరోజు 27వ తేది గురువారం 10 గంటల నుంచి ఇంటర్వ్యూలు నిర్వహించారు. మండలం మొత్తానికి 72 యూనిట్లు ఉండగా దాదాపు 900 మంది అభ్యర్థులపైగా దరఖాస్తు చేసుకున్నారు. దీనికి పెనుమూరు మండలంలోని అన్ని బ్యాంకుల మేనేజర్లు మరియు ఎంపీడీవో నీలకంఠేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.
పెనుమూరు మండలంలో సప్తగిరి బ్యాంక్,స్టేట్ బ్యాంకు, యూనియన్ బ్యాంకు ఉగ్రహణం పల్లి సప్తగిరి బ్యాంక్,బండపల్లి యూనియన్ బ్యాంకు, పోలవరం ఎస్బిఐ బ్యాంకు మేనేజర్లు పాల్గొని వారి వారి బ్యాంకులకు వచ్చిన అభ్యర్థుల అప్లికేషన్లు పరిశీలించి అభ్యర్థులను ఇంటర్వ్యూ చేశారు. దరఖాస్తుదారులఒరిజినల్ సర్టిఫికెట్లను, వారు ఏ యూనిట్లకేశారో అడిగి తెలుసుకున్నారు. పెనుమూరు సప్తగిరి బ్యాంక్ తరఫున మేనేజర్ నాగరాజు పాల్గొని ఆ బ్యాంకుకు వచ్చిన అభ్యర్థుల అప్లికేషన్లను పరిశీలించి వాళ్ల వివరాలు తెలుసుకున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
