TRINETHRAM NEWS

అనపర్తి నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి
అనపర్తి సీఐపై దాడిని ఖండించిన సూర్యనారాయణ రెడ్డి

Trinethram News : అనపర్తి : ఈనెల 23వ తేదీన స్థానిక బి జె పి శాసన సభ్యుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కుమారుడు మనోజ్ రెడ్డి వివాహ రిసెప్షన్ కు కు విధులు నిర్వహిస్తున్న స్థానిక సీఐ సుమంత్ పై మనోజ్ రెడ్డి అనుచరులు దాడి చేసి గాయపరిచిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నానని అనపర్తి నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి అన్నారు
ఈరోజు అనపర్తి వై ఎస్ ఆర్ సి పి కార్యాలయంలో పాత్రికేయ సమావేశంలో ఈయనమాట్లాడుతూ కూటమిపాలనలో ఎన్నో అరాచకాలు అక్రమాలు జరుగుతున్నాయి అని, ప్రజలకు రక్షకభటులు గా ఉండే పోలీసులపైనే అధికార పార్టీ నాయకుల అనుచరులు దాడుల కు దిగి దాడి చేసి గాయపరిస్తే పోలీసులే తమని తాము రక్షించుకోవడానికి ప్రయత్నాలు చేయవలసి వస్తేఇక సామాన్య మానవుల పరిస్థితి ఏంటి అని
స్థానిక సీఐ సుమంత్ పై దాడి చేసిన వారు మేము మనోజ్ రెడ్డి మనుషులము మమ్మల్ని ఆపుతావా అని దాడికి దిగారు అంటే అధికార పార్టీ ఆగడాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రజలకు గ్రహించాలని, పట్టపగలే వైసిపి కార్యకర్తలు నాయకులు పై దాడులు జరుగుతుంటే పట్టించుకోని పోలీసులు
కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తుంటే అటువంటి పోలీసులపైనే అధికార పార్టీ నాయకులను దాడులు చేస్తున్నారు అంటే పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది అర్థం చేసుకోవాలి జరిగిన ఘటనను స్థానిక శాసనసభ్యులు ఇప్పటివరకు ఖండించకపోవడం ఈ పాలకులు
పోలీస్ వ్యవస్థకి ఈ ప్రభుత్వం ఏపాటి గౌరవం ఇస్తున్నారోపోలీసులు అర్థం చేసుకోవాలి
కూటమిపాలనలో అనపర్తి నియోజకవర్గం లో గంజాయి, పేకాట, మద్యం మత్తులో అనేక అసాంఘికకార్యక్రమాలు పెరిగాయని దీనితో యువత పెడదోవ పెడుతుందని ఈ పరిస్థితి విస్తృత రూపం దాల్చకముందే అధికారులు చర్యలు తీసుకునకపోతే భవిష్యత్తు భయంకరంగా ఉంటుదని, సాక్షాత్తు శాసనసభ్యుడు స్వగ్రామం రామవరం లోనే పేకాట శిబిరం నిర్వహిస్తున్నారని ఆ పేకాట శిబిరానికి లక్ష రూపాయలు ముడుపులుగా శాసనసభ్యుడికి అందుతున్నాయని, డబ్బు సంపాదించాలంటే ఏ వ్యాపారం చేసుకోవాలి తప్ప రాజకీయాన్ని వ్యాపారం చేయకూడదని
అనపర్తి నియోజకవర్గం లో అధికార ఎన్డీఏ పార్టీ లో ఉన్ననాయకులు అనుచరులు పోలీసులపై దాడులు చేయడం దురుసుగా ప్రవర్తించడం ఇది కొత్త కాదు అని
2014-2019 మధ్యలో కూడా అనపర్తి నియోజకవర్గం లో కూడా పోలీసులు పై అప్పటి టిడిపి శాసనసభ్యులు ఇప్పటి బిజెపి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అతని కుమారుడు మనోజ్ రెడ్డి అనుచరులు అప్పటిలో అనపర్తిలో ట్రెనీ ఎస్సైగా పనిచేస్తున్న ఆయనపై కూడా దాడి చేసి గాయపరచడం జరిగిందని అప్పట్లో ఈ ఘటనపై పోలీసు ఉన్న స్థాయి అధికారులు అధికార పార్టీ నాయకుల ఒత్తిడికి తలవగ్గి ఏ విధమైన చర్యలు తీసుకోలేదు ఇకనైనా పోలీస్ అధికారులు సరైన సరిగా తీసుకోవాలని అన్నారు ఈ సమావేశంలో
రాష్ట్ర రెడ్డి కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ సత్తి రామకృష్ణారెడ్డి బిక్కవోలు మండలం పార్టీ కన్వీనర్ పోతుల ప్రసాదరెడ్డి బుజ్జి, అనపర్తి నియోజకవర్గం వైఎస్ఆర్సిపి గ్రీవెన్స్ అధ్యక్షులు పడాల దుర్గా ప్రసాద్ రెడ్డి బీసీ సెల్ అధ్యక్షులు ఎంపీటీసీ కోండేటి భీమేష్ పందలపాక వైఎస్ఆర్సిపి కన్వీనర్ సత్తి హరి ప్రసాద్ రెడ్డి ఎంపీటీసీ కర్రి గీతా సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Dr. Satthi Suryanarayana Reddy