TRINETHRAM NEWS

Under the auspices of public organizations protesting against the anti-labour central budget

గోదావరిఖని చౌరస్తాలోప్లే కార్డ్స్ తో నిరసన.

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

గోదావరిఖని మెయిన్ చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ కు నిరసనగా ప్లే కార్డ్స్ తో నిరసన తెలియజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ప్రజాసంఘాల పోరాట వేదిక,సిఐటియు, ఐలూ, ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, సంఘాల నాయకులు మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత సంస్కరణలను వేగవంతం చేసిందన్నారు.

కార్మికుల పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను నాలుగు కోడ్లు గా మార్చి కార్మికుల మెడకు ఉరితాడులు వేశారన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు సంస్థలకు, కార్పొరేట్ పెట్టుబడిదారులకు కారుచౌకగా అమ్మడం కోసం బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వం పనిచేస్తుందని, అదేవిధంగా ఈ మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సింగరేణి బొగ్గు బ్లాకులను వేలం వేయడానికి తీవ్రమైన ప్రయత్నాలు చేస్తుందని దీన్ని వ్యతిరేకించాల్సిన అవసరం అందరిపై ఉందని అన్నారు. తెలంగాణలో ఉన్నటువంటి బొగ్గుబ్లాకులను సింగరేణి సంస్థకే అప్పచెప్పాలని డిమాండ్ చేశారు.

అదేవిధంగా నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలని, యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. దీంతోపాటు చట్టంలో చేసినటువంటి మార్పులు ప్రజలకు,కార్మికులకు వ్యతిరేకంగా ఉన్నాయని, ప్రశ్నించే వారిపై కేసులు పెట్టి జైళ్ళకు పంపుతున్న విధానాన్ని విడనాడాలని అన్నారు. నేషనల్ మోనిటైజేషన్ పైప్ లైన్ పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ ఆస్తులను అమ్మడానికి ప్రయత్నం చేస్తుందని అన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం చేస్తున్న, అనుసరిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఈరోజు నుంచి ఆగస్టు 14 వ తారీకు వరకు వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు తెలియజేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రజాసంఘాల పోరాట వేదిక జిల్లా కన్వీనర్ వేల్పుల కుమారస్వామి, సిఐటియు జిల్లా కార్యదర్శి ఎరవెల్లి ముత్యంరావు, ఐలు నాయకురాలు శైలజ, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఆర్ల సందీప్, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సాగర్, మరియు ప్రజాసంఘాల నాయకులు నరసయ్య, రామాచారి, బిక్షపతి, రాజయ్య, శ్రీనివాస్, బాలకృష్ణ, గణేష్, శివ, శివకుమార్, సురేష్ తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Under the auspices of public organizations protesting against the anti-labour central budget