Undavalli Arun Kumar : జగన్ పై ఉండవల్లి షాకింగ్ కామెంట్స్
టికెట్లు మారిస్తే ఎలా అని నిలదీత!
అమరావతి – మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ షాకింగ్ కామెంట్స్ చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాజకీయాల్లో త్యాగాలు చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదన్నారు. ఇది తన రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడ లేదని పేర్కొన్నారు.
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. టికెట్లు మార్చే ప్రక్రియ మంచి పద్దతి కాదన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలకు ఎక్కడా అధికారం లేదన్నారు. విచిత్రం ఏమిటంటే అధికారం అంతా జగన్ మోహన్ రెడ్డికి, వాలంటీర్లకు మాత్రమే ఉందని మండిపడ్డారు.
ఇదిలా ఉండగా ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. ఇక ఏపీ రాష్ట్రంలో త్వరలోనే శాసన సభ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో మొత్తం 175 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. వీటిలో అన్నీ గెలవాలని దిశా నిర్దేశం చేయడం జగన్ కు మంచి పద్దతి కాదన్నారు ఉండవల్లి అరుణ్ కుమార్.
తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు సంయుక్తంగా ఈసారి బరిలో నిలవడం మరింత ఆసక్తిని రేపుతోంది. కేసుల నమోదుతో హల్ చల్ చేయడం మంచి పద్దతి కాదన్నారు ఉండవల్లి అరుణ్ కుమార్.