అందుబాటులో లేని డాక్టర్లు
త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధి
జ్వరం కోసం వెళితే బిపి టాబ్లెట్ ఇచ్చిన రామయ్య గూడా ప్రభుత్వాసుపత్రి
- చిన్నపిల్లలకి సిరప్ ఇవ్వవలసిన టాబ్లెట్లు ఇచ్చిన వైనం
- డాక్టర్ లేకపోవడంతో అక్కడ ఉన్న నర్సే డాక్టర్
- వ్యాధిగ్రస్తుల ఆరోపణలు
- ఫార్మసిస్ట్ డాక్టర్ చిట్టిలేకుండానే మందులు ఇచ్చేస్తుంది
వికారాబాద్ జిల్లా పరిధిలో మున్సిపాలిటీ పరిధిలో రామయ్య గూడా సమీపంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో అక్కడున్న నర్స్ జ్వరానికి ఇవ్వవలసిన మాత్రలు మర్చిపోయి బీపీ మాత్రలు ఇవ్వడం జరిగిందని కొంతమంది వ్యాధిగ్రస్తుల బాధితులు ఆరోపించారు. శనివారం మున్సిపాలిటీ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వైద్యం కోసం వెళ్ళిన బాధితులు తెలిపిన వివరాల ప్రకారం… జ్వరం వచ్చిందని ఐదు సంవత్సరాలు పాపను ఇంటికి దగ్గరగా ఉందని రామాయగూడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళితే సర్ది జ్వరానికి ఇవ్వవలసిన మాత్రలు ఇవ్వకుండా బిపి మాత్రలు ఐదు సంవత్సరాల పిల్లలకు ఇవ్వటం ఎంతవరకు సరి అయిందో ఉన్నతాధికారులు ఆలోచించాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వైద్యులు అందుబాటులో లేకపోతే జిల్లా ఆరోగ్య కేంద్రం నుంచి ఒక డాక్టర్ ఏర్పాటు చేయాలని కోరారు. - వైద్యుడు చేయవలసిన పనిని స్థానిక నరుసు చేయడం ద్వారా ప్రణాపస్థితి ఏర్పడితే దానికి బాధ్యులు ఎవరు అని ప్రశ్నించారు…? దేవుని తర్వాత నమ్మేది ఒక డాక్టర్ను మాత్రమే అని పేర్కొన్నారు. అలాంటి వైద్య వృత్తిలో ఇవ్వవలసిన వ్యాధికి మాత్రలు ఇవ్వకుండా మరో వ్యాధికి మాత్రలు ఇస్తే ప్రభుత్వ ఆసుపత్రి పై ఉన్న నమ్మకం కూడా ప్రజలలో పోతుందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఇప్పుడిప్పుడే ప్రజలు వైద్యం కోసం వస్తూ ఉంటే ఇలాంటి సంఘటనలు జరిగితే సాధారణ ప్రజలు వైద్యం కోసం ఎక్కడికి వెళ్లాలని ఆరోపించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పట్ల ఉన్నత అధికారులు తనిఖీలు లేకపోవడం ద్వారానే ఇలా జరుగుతుందని ఆరోపించారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ప్రభుత్వ ఆసుపత్రిలపై తగిన చర్యలు తీసుకోవాలన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App