
తేదీ : 22/03/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , ఆకివీడు మండలంలో విషాదం చోటు చేసుకుంది. ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు ప్రమాదవశాత్తు మృతి చెందారు. చిన్న కాపవరం గ్రామానికి చెందినటువంటి సాయి పవన్, శరత్ కుమార్ 5వ తరగతి చదువుతున్నారు.
ఒంటిపూట సెలవులు కావడంతో పాఠశాల అయ్యాక కాలువలో స్నానానికి దిగడం జరిగింది. నీటి ఉదృత కారణంగా నీట మునిగి మృత్యువాత పడ్డారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
