
అమెరికాలో వరుసగా చోటుచేసుకుంటున్న విమాన ప్రమాదాలు
ఆరిజోనా రాష్ట్రంలో ఢీకొన్న రెండు చిన్న విమానాలు
ప్రమాదంలో ఇద్దరి మృతి
Trinethram News : అమెరికాలో వరుస విమాన ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. గత నెల 31న ల్యాండ్ అవుతున్న ఓ విమానాన్ని హెలికాప్టర్ ఢీకొన్న ఘటనలో 67 మంది మృత్యువాత పడ్డ సంగతి తెలిసిందే. తాజాగా అమెరికాలో సింగిల్ ఇంజిన్‌తో కూడిన రెండు చిన్న విమానాలు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు.
ఈ ప్రమాదం తాలూకు వీడియో ఒకటి నెట్‌లో చక్కర్లు కొడుతోంది. అమెరికాలోని ఆరిజోనా రాష్ట్రంలో ఈ ప్రమాదం జరిగింది. అమెరికా కాలమానం ప్రకారం బుధవారం ఉదయం రన్ వే పై సెస్నా 1725, లాంకైర్ 360 ఎంకే 11 ఢీకొన్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. మృతులకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
