TRINETHRAM NEWS

మార్కాపురంలో ఆక్రమణాల పేరుతో రెండు రోజులు హడావుడి,
Trinethram News : ప్రకాశం జిల్లా మార్కాపురం.

జిల్లా పరిషత్ బాలికల ఉన్నతా పాఠశాల, టిటిడి కళ్యాణ మండపం ప్రహరీ గోడ ప్రాంతాలలో ఉన్న చిరు వ్యాపారుల పై టార్గెట్ చేసి చిరు వ్యాపారస్తులను రోడ్డుమీద పడవేసిన అధికారులు..?

మున్సిపల్ కార్యాలయం ఎదురు, నెహ్రూ బజార్, తర్లుపాడు రోడ్డులోని పూల సుబ్బయ్య కాలనీ,చెన్నకేశవ స్వామి ఆలయం ఎదురు, అయ్యప్ప స్వామి ఆలయం పక్కన వీధి, నాలుగు మండపాలు వైపు అధికారులు చూడకపోవడానికి కారణాలు ఏంటి…? ఆ ప్రాంతాలలో అక్రమ నిర్మాణాలు జరగలేదా లేక అక్రమాకులతో అధికారులు కుమ్మక్కు అయ్యారా… అంటూ పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు..

ప్రధాన వీధుల్లో ఉన్న ఆక్రమములను పోలీసులు, మున్సిపల్ అధికారులు తొలగించి అధికారుల దృష్టిలో ప్రజలందరూ సమానమే అనే భావన ప్రతిపక్ష పార్టీల కు, వామపక్ష పార్టీలకు తెలిసేలా చేస్తారని ప్రజలు ఆశిస్తున్నారు…….

ప్రజల ఆశలు నెరవేరేనా ఆక్రమణలు తొలగించేనా వేచి చూడాల్సిందే మరి…

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App