TRINETHRAM NEWS

తితిదే పాలక మండలి భేటీ.. 80 అంశాల అజెండాపై చర్చ

Trinethram News : తిరుమల : తితిదే నూతన పాలక మండలి (TTD Board) సమావేశం కొనసాగుతోంది. తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు (BR Naidu) అధ్యక్షతన జరుగుతున్న సమావేశంలో 80 అంశాలతో కూడిన అజెండాపై సుదీర్ఘంగా చర్చిస్తున్నారు..

వైకాపా పాలనలో సామాన్య భక్తులకు ఎదురైన ఇబ్బందులను తొలగించడంపై పాలకమండలి దృష్టిసారించింది.

వైకుంఠం క్యూకాంప్లెక్స్‌ను అందుబాటులోకి తేవడంపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశముంది. తిరుమలలో అన్యమత ప్రచారం జరగకుండా కఠిన చర్యలు చేపట్టే అంశంపైనా చర్చిస్తున్నట్లు సమాచారం. స్వామివారి నైవేద్యాలు, లడ్డూ ప్రసాదాలు, అన్న వితరణ కేంద్రంలో వినియోగించే ఉత్పత్తుల నాణ్యత పెంచడంపై చర్చించే అవకాశముంది. భక్తులకు కేటాయించే వసతి గృహాల్లో ఎదురవుతున్న ఇబ్బందులపై సమావేశంలో చర్చ జరుగుతున్నట్లు తెలిసింది..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App