Trinethram News : జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మున్సిపాలిటీలో శ్రీమతి సావిత్రిబాయి పూలే 127వ వర్ధంతిని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్బంగా వక్తలు మాట్లాడుతూ భారత మనువాదనిచ్చిన మెట్ల కుల వ్యవస్థ సమాజంలోని అమ్మకు అక్షరాన్ని దూరం చేసిన అమానవీయ నాగరికత సమాజంలో అమ్మకు అక్షరము నేర్పి అణగారిన ప్రజల యొక్క ఆత్మగోషణ సమాజానికి తెలియజేసినటువంటి సామాజిక సంఘ సంస్కర్త చదువుల తల్లి సావిత్రిబాయి పూలేకు భారతజాతి ఎంత రుణపడి ఉన్నది. అట్టి అమ్మకు నేడు ఘనంగా నివాళులర్పించడం ప్రథమ కర్తవ్యం ఆ తల్లి అక్షర ఉగ్గుపాలే నేటి సమ సమాజంలో ఆకాశంలో సగముగాను అన్ని రంగాల్లో నేటి మహిళలు సమాజ అభివృద్ధికి పాటుపడుతున్నరు అంటే సావిత్రి భాయ్ ఎనలేని త్యాగమే.
అలాగే మాల మల్లికార్జున మాట్లాడుతూ పట్టణంలో మహనీయుల విగ్రహాల కొరకు స్థలం కేటాయించి, వాటిని ప్రతిష్టించాల్సిన అవసరము ఎంతైనా ఉందని చైర్మన్ గారికి విన్నవించారు.అలాగే అంబేద్కర్ విగ్రహాన్ని రోడ్డు మధ్యలో పున ప్రతిష్టించాలని కోరారు.
ఇట్టి కార్యక్రమానికి ముఖ్య *అతిథులు ఐజ మున్సిపల్ చైర్మన్ చిన్నదేవన్న, మాజీ MEO మేరమ్మ, పౌరహక్కుల సంఘం నేత విజయభాస్కర్ రెడ్డి, బేడ బుడగ జంగం జిల్లా అధ్యక్షులు మారెప్ప, టిఆర్ఎస్వి జిల్లా నాయకులు మల్లికార్జున, టిడిపి నాయకులు సుధాకర్ గౌడ్, మాజీ టిడిపి అంజిబాబు, ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు నాగరాజు, సీనియర్ నాయకులు ఆంజనేయులు, ప్రభాకర్, డాక్టర్ రాజు, శాస్త్రి, తాపీ కార్మికులు బొగ్గుల ప్రకాశం ప్రసాద్, టిఆర్ఎస్ నాయకులు అన్ని ప్రజాసంఘాల నాయకులు పార్టీల నాయకులు పాల్గొన్నారు