పొంగులేటి రాఘవ రెడ్డికి నివాళి

TRINETHRAM NEWS

పొంగులేటి రాఘవ రెడ్డికి నివాళి

కల్లూరు : తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తండ్రి పొంగులేటి రాఘవ రెడ్డి ఆరో సంవత్సరీకాన్ని స్వగ్రామం కల్లూరు మండలం నారాయణపురంలో సోమవారం నిర్వహించారు. ఆయన జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన సమాధి వద్ద కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాధురి, ఆయన సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి, శ్రీలక్ష్మి దంపతులతో పాటు రాఘవరెడ్డి సతీమణి స్వరాజ్యం, ఇతర కుటుంబ సభ్యులు సమాధి వద్ద పూజలు నిర్వహించారు. అనంతరం అతిథులతో కలిసి భోజనాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్, మార్క్ ఫెడ్ మాజీ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు అయిలూరి వెంకటేశ్వరరెడ్డి, మువ్వా విజయబాబు తదితరులు పాల్గొన్నారు….
మీ
రవికుమార్

You cannot copy content of this page

Scroll to Top