జూన్ 27, 2026

WhatsApp Image 2024 01 01 at 4.35.24 PM

TRINETHRAM NEWS

పొంగులేటి రాఘవ రెడ్డికి నివాళి

కల్లూరు : తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తండ్రి పొంగులేటి రాఘవ రెడ్డి ఆరో సంవత్సరీకాన్ని స్వగ్రామం కల్లూరు మండలం నారాయణపురంలో సోమవారం నిర్వహించారు. ఆయన జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన సమాధి వద్ద కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాధురి, ఆయన సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి, శ్రీలక్ష్మి దంపతులతో పాటు రాఘవరెడ్డి సతీమణి స్వరాజ్యం, ఇతర కుటుంబ సభ్యులు సమాధి వద్ద పూజలు నిర్వహించారు. అనంతరం అతిథులతో కలిసి భోజనాలు స్వీకరించారు.

You cannot copy content of this page