తాగునీటి కోసం రోడ్డు ఎక్కిన గిరిజనులు.
కనీసం మంచి నీరు కోసం ఇబ్బందులు పడుతున్నా మహిళలు.
అల్లూరి జిల్లా అరకులోయ:త్రినేత్రం న్యూస్, జనవరి 20.
అరకువేలి మండలం బస్కి పంచాయతీ కొంత్రాయిగుడ గ్రామంలో రోజురోజుకి మంచి నీరు సమస్య తీవ్రంగా పెరుగుతుంది. కొంత్రాయిగుడ గ్రామస్తులు సిపిఎం పార్టీ నాయకులు కలిసి మంచినీరు సమస్య తక్షణమే పరిష్కారం చేయాలని నిరసన కార్యక్రమం చేయడం జరిగింది.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం పార్టీ నాయకులు సమర్డి బాబురావు కొర్రాగూడ క్లస్టర్ పెసా కార్యదర్శి కొర్రా దేవన్న మాట్లాడుతూ, కొంతరైగూడ గ్రామంలో సుదీర్ఘకాలంగా మంచినీరు సమస్య పరిష్కారం చేయాలని గతంలో అనేక పోరాటాలు ఆందోళన నిరసన కార్యక్రమాలు చేసిన ఫలితంగా బోరు మంజూరు చేయాలని అయింది. పంచాయితీ పరిధిలో తీవ్రమైన మంచినీరు సమస్య ఉన్న కొంత్రాయిగుడలో ఈరోజు వరకు సమస్య పరిష్కారం చేయకపోవడానికి పాలకుల ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం ధోరణి వల్లే సమస్యకు పరిష్కారం దొరకడం లేదని అన్నారు. బోరు తవ్వి సంవత్సరం గడుస్తున్న ఈరోజు వరకు మంచినీరు సమస్య పరిష్కారం చేయకపోవడం దారుణం అన్నారు.
ఇట్టి సమస్య పరిష్కారానికి తక్షణమే విద్యుత్ ట్రాన్స్ఫారం మంజూరు చేసి పివిటిజి గ్రామం అయిన కొంత్రాయిగుడలో మంచినీరు శాశ్వతంగా సమస్య పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు.నీటీ ఎద్దడి నివారణకు పాలకులు చిత్తశుద్ధితో పనిచేయడం లేదని అన్నారు. నీటి సమస్య తీవ్రంగా ఉండడం వలన అనేక జబ్బులకు గురై ఇబ్బంది పడుతున్నాము అన్నారు. సత్వరమే నీటి సమస్య పరిష్కారం చేయని యెడల ఆందోళన ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పెసా కమిటీ కొర్రగూడ క్లస్టర్ కార్యదర్శి కొర్రా దేవన్న సిపిఎం పార్టీ బస్కి పంచాయితీ నాయకులు సమర్డి బాబురావు,కొర్రా సుబ్బారావు , సమర్డి.దాసు, సమర్డి .చంప, సమర్డి కలిమ సమర్డి పూర్ణిమ సమర్డి నాగమణి కిల్లో జయంతి,మహిళలు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App