TRINETHRAM NEWS

అల్లూరి జిల్లా అనంతగిరి మండలం త్రినేత్రం న్యూస్ మార్చి 19: గిరిజన యువతకు క్రీడల్లో ప్రోత్సహించేందుకు వాలి బాల్ కిట్లు పంపిణీ చేసిన జనసేన పార్టీ అనంతగిరి మండల అధ్యక్షులు చిట్టం మురళి.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంజాయి ,డ్రగ్స్ వంటి దురలవాలాట్లకు బానిసలు కావద్దు ఆసక్తితో క్రీడల్లో రాణించే యువతకు చేతనైనంత ప్రోత్సాహం అందిస్తూ వారికి క్రికెట్,వాలి బాల్ కిట్లు అందిస్తూ ప్రోత్సహించానికి మేము సిద్ధంగా వుంటామని ఈ అవకాశాన్ని గిరిజన యువతి యువకులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అలాగే గిరిజన యువత మానసిక,శారీరక ఆరోగ్యం కోసం క్రీడలు ఎంతో మేలు చేస్తాయని ఇప్పటికే గిరిజన యువతి యువకులు యువ క్రీడాకారులు జాతీయ స్థాయిలో గుర్తింపు సాదిస్తున్నారని వారికి నాణ్యమైన శిక్షణ ఇచ్చి ప్రోత్సహిస్తే గిరిజన జాతి ఖ్యాతి అంతర్జాతీయంగా పేరు తెస్తారాన్నారు.

సహజంగా గిరిజన ప్రాంతంలో పెరిగే గిరిజన యువతి యువకులకు,శారీరక దృఢత్వం ఉంటుందని కానీ సరైన శిక్షణ లేక ఆర్ధిక స్థితి బాగోలేక ఎందరో క్రీడాకారులు నేడు గ్రామాల్లోనే అన్డిపోతున్నారాన్నారు వారిని సరైన దిశగా స్థానిక ప్రజాప్రతినిధులు,అధికారులు శిక్షణ అందిస్తే మెరుగైన ఫలితాలు సాధిస్తారని ఒక రకంగా గిరిజన యువత అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండటం కోసం కూడా క్రీడలు ఎంతో మేలు చేస్తాయని తెలిపారు.ఈ సందర్భంగా అనంతగిరి మండలం దండబాడు గ్రామ యువతకు వాలి బాల్ కిట్లు స్థానిక గ్రామ కెప్టెన్ కిల్లో కుమార్ వైస్ కెప్టెన్ చిట్టం రవి సింహాద్రి మరియు టీమ్ సభ్యులకు అందించారు.
ఈ కార్యక్రమంలో జనసేన మండల నాయకులు కొర్ర రవి. పాంగి లక్ష్మణ్. ఎస్ రామారావు. పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

stay away from ganja