TRINETHRAM NEWS

Tragedy took place at Porubandar beach in Gujarat

Trinethram News : అరేబియా సముద్రంలో భారతీయ నౌకాదళానికి చెందిన అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్ కూలింది.

రెస్క్యూ కోసం వెళ్లిన ఆ హెలికాప్టర్ కూలిన ఘటనలో ముగ్గురు సిబ్బంది గల్లంతు అయ్యారు.

ఒకరి మృతదేహాన్ని గుర్తించారు. మోటార్ ట్యాంకర్ హరి లీలా నౌక వద్దకు రెస్క్యూ చేసేందుకు ఆ హెలికాప్టర్ వెళ్లింది. అయితే ఆ సమయం లో హార్డ్ ల్యాండింగ్ జరిగినట్లు అనుమానిస్తున్నారు. దీంతో ఐసీజీ సిబ్బంది రంగంలోకి దిగింది. నాలుగు నౌకలు, రెండు విమానాల ద్వారా సెర్చ్ ఆపరేషన్ చేపడుతున్నారు. సోమవారం రాత్రి 11 గంటలకు ఏఎల్‌హెచ్ రెస్క్యూ ఆపరేషన్‌కు వెళ్లింది. కొన్ని రోజుల క్రితమే ఆ హెలికాప్టర్ గుజరాత్‌లో వదరల్లో చిక్కుకున్న 67 మందిని రక్షించింది.

కాగా, నలుగురు సిబ్బంది, ఇద్దరు పైలట్లతో వెళ్తున్న హెలికాప్టర్ గుజరాత్‌లోని పోర్‌బందర్ తీరంలో గత రాత్రి అత్యవసరంగా ల్యాండ్ అయింది. హెలికాప్టర్.. నౌకను సమీపిస్తుండగా ఈ ఘటన జరిగినట్టు కోస్ట్‌గార్డు అధికారులు తెలిపారు. గల్లంతైన ఇద్దరు డైవర్లలో ఒకరిని రక్షించామని, మరో డైవర్, ఇద్దరు పైలట్ల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. నాలుగు నౌకలు, రెండు విమానాలతో గాలింపు చేపడుతున్నట్టు ఇండియన్ కోస్ట్‌ గార్డ్ తెలిపింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Tragedy took place at Porubandar beach in Gujarat