TRINETHRAM NEWS

పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం ఎడ్లపాడు మండల పరిధిలోని తిమ్మాపురం జాతీయ రహదారిపై గంజాయి పెట్టివేత. స్థానిక సమాచారం మేరకు ఇద్దరు వ్యక్తులు సీలేరు నుండి హైదరాబాదుకు రెండు బైకులపై ఏడు బ్యాగుల గంజాయితో ప్రయాణం చేస్తూ తిమ్మాపురం వద్ద జాతీయ రహదారిపై ఒకరినొకరు ఢీకొట్టుకుని కింద పడిపోవడం జరిగినది. చుట్టుపక్క సానికులు వాళ్ళను లేపి బ్యాగులను బైక్ పై పెడుతున్నప్పుడు అందులో నుంచి గంజాయి ప్యాక్ చేసినవి ఒకటి కింద పడింది. వెంటనే స్థానికులు సమాచారం పోలీసులకు అందించారు. చిలకలూరిపేట రూరల్ సీ.ఐ పి.శ్రీనివాస రెడ్డి,నాదెండ్ల ఎస్.ఐ బలరాం రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.