
Trinethram News : AP: అనంతపురం జిల్లా రాప్తాడులో రేపు వైసీపీ నిర్వహిస్తోన్న సిద్ధం బహిరంగ సభలో సీఎం జగన్ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటిస్తారని సమాచారం. వృద్ధులు, వితంతువుల పెన్షన్లను రూ.4వేలకు పెంచడంతోపాటు రైతు రుణమాఫీ అంశాలు అందులో ఉంటాయని వార్తలు వస్తున్నాయి. అలాగే మహిళల కోసం సరికొత్త పథకాలను ప్రకటిస్తారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో మేనిఫెస్టోపై రాజకీయవర్గాల్లో చర్చ సాగుతోంది
