
రేపు టీ-కాంగ్రెస్ కీలక భేటీ
టీపీసీసీ విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశం ఈనెల 23న గాంధీభవన్లో జరగనుంది.
సీఎం, టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి అధ్యక్షతన జరిగే సమావేశంలో కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జి మాణిక్రావ్ ఠాక్రే, డిప్యూటీసీఎం భట్టివిక్రమార్క, మంత్రులు, పార్టీ ముఖ్యులు పాల్గొంటారు.
ఈనెల 28న జరగనున్న కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవం, నాగ్పూర్ సభకు జన సమీకరణ, తదితర అంశాలపై చర్చిస్తారు.
పార్లమెంట్ ఎన్నికలపై పార్టీశ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు.
