TRINETHRAM NEWS

తక్కువ చేసి చూసే చోట ఎక్కువ సేపు ఉండకు అన్నట్లుగా నేడు వైసీపీ నేతల మాట – నేడు టీడీపీ బాటలో వైసీపీ సీనియర్ నేత పఠాన్ అహ్మద్ భాషా

👉 నేడు నరేంద్ర వర్మ ఆధ్వర్యంలో టీడీపీ తీర్ధం పుచ్చుకున్న కర్లపాలెం మేజర్ పంచాయతీ ఉప సర్పంచ్, వైసీపీ సీనియర్ నాయకులు పఠాన్ అహ్మద్ భాషా.

👉 బాపట్ల ఎమ్మెల్యే పక్షపాత ధోరణితో విసిగిపోయామని, పార్టీలో కష్టపడి పనిచేసే కార్యకర్తకి విలువలేదని ప్రజల నాయకుడుగా అందరి మన్నలు పొందుతున్న నరేంద్ర వర్మ చెంత చేరామని పఠాన్ అహ్మద్ భాషా తెలిపారు

👉 మైనారిటీ సోదర సోదరీలు పడుతున్న ఆటుపోట్లు,తమ ప్రాంతాల్లో నీరుగారిని అభివృద్ధి స్థితిని పఠాన్ అహ్మద్ భాషా వివరించగ… నేనున్నాను అంటూ నరేంద్ర వర్మ భుజం తట్టి భరోసా ఇచ్చారు.

👉 రానున్న కొద్ది రోజుల్లోనే భారీ సంఖ్యలో పఠాన్ అహ్మద్ భాషా తో పాటు వంద మందికి పైగా మైనారిటీ సోదరులు టీడీపీ కండువా కప్పుకోనున్నారు అని నరేంద్ర వర్మ తెలిపారు.