నేడు ఏపీకి కేంద్ర బృందం.. రెండు రోజుల పాటు పర్యటన
అమరావతి:ఆంధ్రప్రదేశ్‌కు రానుంది కేంద్ర బృందం.. ఈ రోజు, రేపు.. రెండు రోజుల పాటు మిచౌంగ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనుంది..
తుఫాన్‌తో నష్టపోయిన పంటలను, ఇతర ఆస్తుల నష్టాన్ని అంచనా వేయనున్నారు.. తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో జరిగిన పంట, ఇతర ఆస్తుల నష్టాన్ని అంచనా వేయడానికి ఈ రోజు రాష్ట్రానికి కేంద్ర బృందం రాబోతుందని.. నేడు కృష్ణా, బాపట్ల జిల్లాల్లో, రేపు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో పర్యటించి పంట నష్టాన్ని అంచనా వేస్తారని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ అంబేద్కర్ వెల్లడించారు. రెండు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనున్న కేంద్ర బృందం.. ముందుగా ఈ రోజు ఇవాళ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ డైరెక్టరుతో భేటీకానుంది.. ఇక, ఆ తర్వాత ఈ రోజు మధ్యాహ్నం నుంచి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పర్యటించనుంది సెంట్రల్ టీమ్.. రేపు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో రెండు బృందాలుగా పర్యటించనున్నారు కేంద్ర బృందంలోని అధికారులు.. క్షేత్ర స్థాయి పరిశీలనతో పాటు.. తుఫాన్‌తో జరిగిన నష్టంపై ఆయా జిల్లాల అధికారుల నుంచి సమాచారం సేకరించనుంది సెంట్రల్ టీమ్..