TRINETHRAM NEWS

Today in History September 09

Trinethram News : సంఘటనలు

1908 – ఆంధ్రపత్రిక ప్రారంభించబడింది. తెలుగు లెక్కలో కీలక నామ సంవత్సరం బాధ్రపద శుద్ధ చతుర్థి హిందువులకు పండుగ దినమైన వినాయక చవితి నాడు కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు ఆంధ్రపత్రికను వారపత్రికగా ప్రారంభించారు. ఇది బొంబాయిలోని తత్వవివేచక ముద్రాక్షరశాలలో ముద్రించబడేది. 1914 ఏప్రిల్ 1 నాడు దినపత్రికగా మారింది మద్రాసులో (చెన్నై)

జననాలు

1914: కాళోజీ నారాయణరావు, తెలుగు కవి, తెలంగాణావాది. (మ.2002) (చిత్రంలో)

1935: వేదాంతం సత్యనారాయణ శర్మ, కూచిపూడి నృత్య కళాకారుడు, నటుడు. (మ.2012)

1940: రాపాక ఏకాంబరాచార్యులు, తెలుగు రచయిత, అవధాన విద్యాసర్వస్వము గ్రంథకర్త (మ.2020)

1953: సి.హెచ్. మల్లారెడ్డి, తెలంగాణ మాజీ మంత్రి.

1953: మంజుల భారతీయ సినీ నటీమణి. (మ.2013)

1957: జయచిత్ర , తెలుగు, తమిళ చిత్రాల నటి

1961: సీమా ప్రకాశ్ బయోటెక్నాలజీ శాస్త్రవేత్త. టిష్యూకల్చర్‌లో నిపుణురాలు.

1970: బిజూ మీనన్, మళయాళ, తెలుగు,తమిళ చిత్రాల సహాయ నటుడు, జాతీయ అవార్డ్ గ్రహీత.

మరణాలు

1978: బైరాగి , ప్రముఖకవి , కథ రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత(జ.1925)

2003: గులాబ్‌రాయ్ రాంచంద్, భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు. (జ.1927)

జాతీయ దినాలు

తెలంగాణ భాషా దినోత్సవం

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Today in History September 09