TRINETHRAM NEWS

సంఘటనలు

1888: అత్యధిక సర్క్యులేషన్ కల మలయాళ వార్తాపత్రిక మలయాళ మనోరమను కందత్తిల్ వర్ఘీస్ మాప్పిల్లై స్థాపించాడు.

1931: భారతదేశములో తొలి టాకీ చిత్రము, అర్దెషీర్ ఇరానీ దర్శకత్వము వహించిన ఆలం ఆరా ముంబైలోని గోరేగాఁవ్ లోని ఇంపీరియల్ సినిమా థియేటరులో విడుదలయ్యింది

2008: హైదరాబాదులోని శంషాబాదు అంతర్జాతీయ విమానాశ్రయానికి సోనియా గాంధీ చే ప్రారంభోత్సవం జరిగింది.

జననాలు

1842: కొక్కొండ వేంకటరత్నం పంతులు. మహామహోపాధ్యాయ బిరుదు పొందిన ఆధునికాంధ్రులలో రెండవ వ్యక్తిగా ఘనత వహించిన సంగీతజ్ఞుడు, కవి, నాటక రచయిత. (మ.1915)

1879: ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, భౌతికశాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత. (మ.1955)

1917: కె.వి.మహదేవన్, తెలుగు చలన చిత్ర సంగీత దర్శకుడు. (మ.2001)

1930: నాయని కృష్ణకుమారి, తెలుగు రచయిత్రి. (మ.2016)

1937: జొన్నలగడ్డ గురప్పశెట్టి, కలంకారీ కళాకారుడు, 2009లో పద్మశ్రీ పురస్కారము తోనూ సత్కరించబడ్డారు.

1965: ప్రముఖ బాలీవుడ్ నటుడు,దర్శకుడు, నిర్మాత ఆమిర్ ఖాన్ జననం.

మరణాలు

1664: గురు హర్‌కిషన్, సిక్కుల ఎనిమిదవ గురువు.

1883: కారల్ మార్క్స్, తత్వవేత్త, రాజకీయ-ఆర్థికవేత్త, విప్లవ కారుడు.

2013: అడబాల, రంగస్థల నటుడు, రూపశిల్పి. (జ.1936)

2022: అనిల్ జోషియార గుజరాత్ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు. మాజీమంత్రి. (జ.1953)

పండుగలు, జాతీయ దినాలు

పై డే : గణితంలో వాడే ఒక గుర్తు పేరు ‘పై’ (22/7). పై యొక్క విలువ 3.14159…. దానిని పురస్కరించుకకుని, గణిత మేధావులు ఈ రోజును పై డేగా జరుపుకుంటున్నారు.