చరిత్రలో ఈరోజు జనవరి 26
సంఘటనలు
1565: దక్షిణ భారతదేశమున చివరి హిందూ సామ్రాజ్యమైన విజయనగర పతనానికి దారితీసిన రాక్షసి తంగడి యుద్ధం జరిగింది.
1950: స్వతంత్ర భారతదేశం గవర్నర్ జనరల్‌గా చక్రవర్తి రాజగోపాలాచారి పదవీ విరమణ..
1950:భారత గణతంత్ర దినోత్సవం. జనవరి 26 న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది.
1950: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం అవతరించింది.
1950: భారత సుప్రీం కోర్టు పనిచెయ్యడం మొదలుపెట్టింది.
1950: భారత రాష్ట్రపతిగా రాజేంద్రప్రసాద్ పదవిని స్వీకరించాడు.
1957: జమ్మూ కాశ్మీరు రాష్ట్రం అవతరించింది.
1965: హిందీ భాషను భారత అధికార భాషగా గుర్తించారు.
2001: గుజరాత్ లో భయంకర భూకంపం – 20,000 మంది దుర్మరణం.
జననాలు
1926: ఆవంచ హరికిషన్ నిజాం విమోచన ఉద్యమకారుడు .
1935: వాండ్రంగి రామారావు (భావశ్రీ), తెలుగు సినీ రచయిత, కవి, రాష్ట్ర పురస్కార గ్రహీత, వక్త, వ్యాఖ్యాత, రూపకకర్త, ఆకాశవాణి ప్రసంగికుడు
1957: శివలాల్ యాదవ్, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు .
1961: మల్లేశ్ బలష్టు, కవి, రంగస్థల నటుడు, రచయిత, దర్శకుడు, సినీ నటుడు.
1968: రవితేజ (నటుడు), తెలుగు చలనచిత్ర ఇండస్ట్రీలో రవితేజ ముఖ్య స్థానంలో ఉన్నారు.
1985: నవదీప్, భారతీయ సినీ నటుడు. పలు తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలలో నటించాడు.
మరణాలు
1839: జెన్స్ ఎస్మార్క్ డానిష్-నార్వేయిన్ భూవిజ్ఞాన శాస్త్రజ్ఞుడు. ప్రపంచవ్యాప్త మంచు యుగాల క్రమాన్ని వివరించాడు. (జ.1763)
1986: కొర్రపాటి గంగాధరరావు,. నటుడు, దర్శకుడు, శతాధిక నాటకకర్త, కళావని సమాజ స్థాపకుడు. (జ.1922)
2010: తెలుగు సినీనటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు (జ.1927)
2015: ఆర్.కె.లక్ష్మణ్, వ్యంగ్య చిత్రకారుడు. common man సృష్టికర్త. (జ.1924)
పండుగలు, జాతీయ దినాలు🇮🇳
భారత గణతంత్ర దినోత్సవం
ఇంటర్నేషనల్ కస్టమ్స్ దినోత్సవం
అంతర్జాతీయ పర్యావరణ విద్యా దినోత్సవం