చరిత్రలో ఈరోజు జనవరి 25
సంఘటనలు
1905: ప్రపంచంలోని అతిపెద్దదైన 3106 క్యారెట్ల కల్లినన్ (Cullinan) వజ్రం దక్షిణ ఆఫ్రికా గనుల్లో కనుకొనబడింది
1918: రష్యన్ సామ్రాజ్యం నుండి “సోవియట్ యూనియన్” ఏర్పడింది.
1939: చిలీ దేశంలో వచ్చిన భూకంపంలో దాదాపు పదివేల మంది మరణించారు.
1950: భారత ఎన్నికల సంఘం స్థాపించబడింది
1950: భారత గవర్నర్ జనరల్ పదవిని రద్దుచేసారు.
1971: హిమాచల్ ప్రదేశ్ 18వ రాష్ట్రంగా అవతరించింది.
1971: నరరూప రాక్షసుడుగా పేరొందిన ఉగాండా నియంత ఈడీ అమీన్ సైనిక కుట్ర ద్వారా అధికార పగ్గాలు చేజిక్కించుకున్నాడు.
1980: మిషనరీస్ ఆఫ్ ఛారిటీని స్థాపించిన మదర్ థెరీసా ను భారత ప్రభుత్వం భారతరత్న పురస్కారంతో సత్కరించింది.
1983: ఆచార్య వినోబా భావేకు మరణానంతరం అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న లభించింది.
2010: ఇథియోపియాకు చెందిన విమానం మధ్యధరా సముద్రములో కూలిపోయి 90 మంది మృతిచెందారు.
జననాలు
1918: కొండవీటి వెంకటకవి, ప్రసిద్ధ కవి, హేతువాది చలనచిత్ర సంభాషణ రచయిత, వ్యాసకర్త. (మ.1991)
1925: పి. అచ్యుతరాం, హేతువాది, సంఘ సంస్కర్త. (మ.1998)
1925: కాకర్ల సుబ్బారావు, రేడియాలజిస్ట్, హైదరాబాదు నిమ్స్ ఆసుపత్రి పూర్వ డైరెక్టర్.
1968: నర్సింగ్ యాదవ్, తెలుగు సినీ నటుడు.(మ. 2020)
మరణాలు
1953: పింగళి వెంకట రామారెడ్డి, నిజాం పరిపాలనలో పోలీసు ఉన్నతాధికారి. (జ.1869)
1991: పి.ఆదినారాయణరావు, తెలుగు సినిమా సంగీత దర్శకులు, నిర్మాత. (జ.1914)
1994: సంధ్యావందనం శ్రీనివాసరావు, దక్షిణభారతదేశపు అగ్రశ్రేణి కర్ణాటక సంగీత విద్వాంసుడు. (జ.1918)
2016: కల్పనా రంజని, మలయాళ సినిమా నటి (జ.1965)
పండుగలు, జాతీయ దినాలు
జాతీయ పర్యాటక దినోత్సవం
జాతీయ ఓటర్ల దినోత్సవం
ఇంటర్నేషనల్ ఎక్సైజ్ దినోత్సవం